Take a fresh look at your lifestyle.

పెరుగుతున్న కొరోనా కేసులు

  • తెలంగాణలో హై అలర్ట్
  • ‌ప్రైవేటు హాస్పిటల్స్ ‌యాజమాన్యాలతో డీహెచ్‌ ‌భేటీ

‌తెలంగాణ కొరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో హై అలర్ట్ ‌ప్రకటించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 86 ప్రభుత్వ క్వారంటైన్‌ ‌కేంద్రాలను ప్రారంభించింది. ఈమేరకు మంగళవారం ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా.జి.శ్రీనివాసరావు ప్రైవేటు హాస్పిటల్స్ ‌యాజమాన్యాలతో సమావేశమయ్యారు. కోవిడ్‌ ‌పేషెంట్లందరికీ చికిత్సలు అందించేందుకు దవాఖానలన్నీ సిద్ధంగా ఉండాలనీ, ప్రతీ దవాఖానాలో కనీసం 50 శాతం పడకలను కోవిడ్‌ ‌బాధితులకు కేటాయించాలని సూచించారు.

ప్రస్తుతం ఉన్న బెడ్ల సంఖ్యకు అదనంగా మరో 50 శాతం బెడ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నాన్‌ ‌కోవిడ్‌ ‌కేసుల సంఖ్యను వీలైనంతగా తగ్గంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గత ఐదు రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అయిందనీ, ప్రజలు జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లనే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నదనీ పేర్కొన్నారు. మరోవైపు, రాష్ట్రంలో కొరోనా విస్తృతి దృష్ట్యా ప్రభుత్వం రోజువారీగా నిర్వహిస్తున్న పరీక్షల సంఖ్యను మరింతగా పెంచింది.

సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల సంఖ్య 1,04,35, 997కు చేరింది. ఈ పరీక్షలలో రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక కేసులు 302 కేసులు జీహెచ్‌ఎం‌సి పరిధిలో నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానంలో 138 కేసులతో మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లాలో 116 కేసులతో మూడో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఈ జిల్లాలలో కొరోనా నియంత్రణపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Leave a Reply