Take a fresh look at your lifestyle.

బెంగాల్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

ప్రముఖ కవి శంఖఘోష్‌ ‌మృత్యువాత

కరోనా మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతున్నది. ఈ వైరస్‌ ‌చిన్నాపెద్దా, బీదాబిక్కీ అనే తేడా లేకుండా అందరి ప్రాణాలు తీస్తున్నది. తాజాగా పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రముఖ కవి శంఖ ఘోష్‌ (89) ‌కూడా కరోనా కాటుకు బలయ్యారు. శంఖఘోస్‌కు ఈనెల 14న కరోనా పాజిటివ్‌ ‌వచ్చింది. అప్పటి నుంచి ఆయన డాక్టర్ల సలహా మేరకు తన నివాసంలోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. పరిస్థితి మరింత విషమించడంతో బుధవారం ఉదయం ఘోష్‌ ‌కన్నుమూశారు. బెంగాలీ సాహిత్యరంగంపై ఆయన చెరగని ముద్రవేశారు. సాహిత్యరంగంలో విశేష సేవలు అందించినందుకుగాను ఆయన ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2011లో పద్మభూషణ్‌, 2016 ‌జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు వరించింది. బాబరర్‌ ‌ప్రార్థన అనే గ్రంథ రచనకుగాను 1977 సాహిత్య అకాడవి• అవార్డు లభించింది. ఘోష్‌ ‌హిందీ, ఇంగ్లిష్‌తోపాటు ఎన్నో భాషలకు సంబంధించిన పుస్తకాలను బెంగాళీలోకి అనువదించారు. ఇకపోతే పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  కరోనా కేసులు భారీగా నమోదు కావడానికి అనేక కారణాలు అనేకం ఉన్నాయి.  అందులో ప్రధాన కారణం ఎన్నికల ప్రచారం.  దేశంలో కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ఉధృతి కొనసాగుతున్న సమయంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో పెద్ద ఎత్తున అన్ని పార్టీలు ప్రచారం చేసుకున్నాయి.  భారీ స్థాయిలో జన సవి•కరణ, సభలు నిర్వహించారు.  సోషల్‌ ‌డిస్టెన్స్ ఏ ‌మాత్రం కనిపించలేదు.  దీంతో సమూహాల్లో కరోనా వ్యాప్తి మొదలైంది.  గత నాలుగు రోజులుగా బెంగాల్‌ ‌రాష్ట్రంలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి కోసం బీజేపీ, తృణమూల్‌ ‌లు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు స్వస్తి పలికింది.  పశ్చిమ బెంగాల్‌ ‌లో మార్చి 11 వ తేదీన 3,110 ఉంటె ఆ సంఖ్య ఏప్రిల్‌ 20 ‌నాటికి ఏకంగా 53వేలకు చేరింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.  ఎన్నికల ప్రచార ప్రభావం కరోనా పెరుగుదలకు ఎలా దోహాసం చేసిందో స్పష్టంగా తెలుస్తోంది.

Leave a Reply