Take a fresh look at your lifestyle.

పెరుగుతున్న సిఎన్‌జి ధరలు

వరుసగా రెండోరోజు పెరిగిన రేట్లు
‌పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెరగడంతో సీఎన్‌జీ వాహనాలు వాడుదామని అనుకుంటే ఇప్పుడు దాని ధర కూడా పెరుగుతోంది. సీఎన్‌జీధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగి కిలో రూ.69.11కి చేరుకుంది. గత 2 రోజుల్లో, ఇందప్రస్థ గ్యాస్‌ ‌లిమిటెడ్‌ ‌సీఎన్‌జీ ధరలను కిలోకు రూ. 5 పెంచింది. ఏప్రిల్‌లో ఇది మూడో పెంపు కాగా ఈ నెలలో మొత్తం కిలో రూ.9.10 పెరిగింది. సహజ వాయువు ధరల పెరుగుదల కారణంగా ధరలను పెంచుతున్నామని వారు తెలిపారు.

ఏప్రిల్‌ 1‌న గ్యాస్‌పై ధర 80 పైసలు, ఏప్రిల్‌ 4‌న కిలోకు రూ.2.50 ఆ తర్వాత ఏప్రిల్‌ 6‌న దీని ధర రూ.2.50 పెరిగింది. గత నెలలో ధరలను కిలోకు 10 రూపాయలు పెంచింది. హైదరాబాద్‌లో కిలో సిఎన్‌జీ ధర రూ. 75.75 ఉండగా, విజయవాడలో రూ.74.75, నోయిడా, గ్రేటర్‌ ‌నోయిడా, ఘజియాబాద్‌లలో కిలో ధర రూ.71.67గా ఉంది. కాగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు.

Leave a Reply