Take a fresh look at your lifestyle.

ఎపిలో పెరుగుతున్న కేసులు, మరణాలు

  • మరో 108 మంది మృత్యువాత
  • ఉయ్యూరు సివిల్‌ ‌జడ్జ్ ‌జాస్తి, పెదకాకాని సర్పంచ్‌ ‌మృతి

అమరావతి, : ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో 108మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 86,878 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 20,345 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ ‌బులెటిన్‌ ‌విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా వైరస్‌ ‌బారినపడి చిత్తూరు జిల్లాలో 18, విశాఖ జిల్లాలో 12, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున.. ప్రకాశం జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 8, కృష్ణా జిల్లాలో ఏడుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. వైఎస్సార్‌ ‌జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. మొత్తం 108 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 8,899 మంది మృతి చెందారు.గత 24 గంటల్లో 14,502 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 11 లక్షల 18 వేల 933 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 1,95,102 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 1,75,14,937 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే కరోనాతో కృష్ణాజిల్లా ఉయ్యూరు సివిల్‌ ‌కోర్టు న్యాయమూర్తి జాస్తి సత్యనారాయణ మూర్తి మృతి చెందారు. ఇటీవలే ఆయన తండ్రి కరోనాతో మృతి చెందారు. న్యాయమూర్తి ఇంట్లో కోవిడ్‌ ‌కారణంగా ఇద్దరు మృతి చెందడంతో ఉయ్యూరు బార్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యులు, న్యాయవాదులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

న్యాయమూర్తి మృతికి ఉయ్యూరు పోలీస్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌ప్రఘాడ సానుభూతి వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా పెదకాకాని సర్పంచ్‌ ‌మాధవిలత కరోనాతో మృతి చెందారు. జిల్లాలో పెదకాకాని మేజర్‌ ‌పంచాయతీగా ఉంది. మాధవిలత టీడీపీ మద్దతు దారుగా నిలిచి సర్పంచ్‌గా గెలుపొందారు. మాధవి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నాయకురాలు, పెదకాకాని గ్రామ సర్పంచ్‌ ‌మండే మాధవీలత మరణం బాధాకరమని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌ అన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ బలపర్చిన అభ్యర్థిగా విజయం సాధించిన మాధవీలత అతి కొద్దిరోజుల్లోనే కరోనా బారినపడటం విషాదకరమన్నారు.

Leave a Reply