Take a fresh look at your lifestyle.

లవర్‌ ‌బాయ్‌ ‌హీరో..రిషి కపూర్‌

aruna
అరుణ ,జర్నలిస్టు ,న్యూ దిల్లీ

ఇర్ఫాన్‌ ‌ఖాన్‌ ‌మరణించిన ఒక రోజు తర్వాత మరో భారతీయ స్టార్‌ ‌రిషి కపూర్‌ ‌మరణించారు. రిషి కపూర్‌కి కేన్సర్‌ అని 2018లో తెలిసింది. 2019 చివరిలో యుఎస్‌లో చికిత్స పొందారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, రిషి కపూర్‌ ఇటీవల హాలీవుడ్‌ ‌హిట్‌ ‘‘‌ది ఇంటర్న్’’ ‌రీమేక్‌లో దీపికా పదుకొనేతో కలిసి నటించనున్నట్లు ప్రకటించారు. రిషి కపూర్‌ ‌సోషల్‌ ‌మీడియాలో చురుకుగా ఉండే వారు. షో మాన్‌ ‌రాజ్‌ ‌కపూర్‌ ‌కొడుకు రిషి. అందుకే సినీ ప్రయాణం చాలా సులువు అయింది రిషికి. 1955లో రాజ్‌ ‌కపూర్‌ ‌తీసిన చిత్రం ‘‘శ్రీ 420’’ చిత్రంలో చిన్న పిల్లాడిగా అతిథి పాత్రతో రిషి కపూర్‌ ‌తన సినిమా ప్రవేశం చేసారు. ఈ సినిమాకి రిషికి అందిన పారితోషికం నర్గిస్‌ ‌చేతి చాకోలెట్‌ ‌బార్‌. అటుపై 1970లో ‘‘మేరా నామ్‌ ‌జోకర్‌’’‌లో బాల నటుడిగా నటించారు. రిషి కపూర్‌ ‌ముద్దు పేరు చింటూ. ఈ పేరుతో ఆయన్ని ఎక్కువ మంది పిలిచేవారు. రాజ్‌ ‌కపూర్‌ ‌మేరా నామ్‌ ‌జోకర్‌ ఇచ్చిన నష్టాలను పూడ్చుకోటానికి 1973లో తీసిన ‘‘బాబీ’’ చిత్రంతో హీరోగా సిల్వర్‌ ‌స్క్రీన్‌కు పరిచయం చేయాలి అనుకున్నప్పుడు రిషి తల్లి పర్మిషన్‌ ‌రాజ్‌ ‌కపూర్‌ అడిగితే… కేవలం శని.. ఆది వారాలలో షూటింగ్‌ ‌చేస్తాను అంటే ఒప్పుకుంటా అని చెప్పారు. అమ్మా, నాన్న చర్చలు విని తెగ సంతోషంలో స్కూల్‌ ‌కాపీలో ఆటో గ్రాఫ్‌ ‌ప్రాక్టీస్‌ ‌చేశాను అని రిషి ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. రిషి కపూర్‌ ‌రొమాంటిక్‌ ‌ప్రయాణం బాబీతో మొదలు అయినప్పుడు డింపుల్‌ ‌పెద్ద స్టార్‌. ‌డింపుల్‌ ‌రిషికి చెప్పేవారట సినిమా హిట్‌ ‌కాకపోయినా ఏమి కాదులే నీకు డ్రైవింగ్‌ ‌వచ్చుగా బతికేయ వచ్చు అని చెప్పేవారు అని రిషి పలు ఇంటర్వ్యూల్లో నవ్వుతూ చెప్పారు. బాబిలో డాన్స్ ‌నేర్పటానికి డాన్స్ ‌డైరెక్టర్‌ ‌కనిపించటం లేదు నాన్న అని రాజ్‌ ‌కపూర్‌ని రిషి అడిగారు. దానికి రాజ్‌ ‌కపూర్‌ ‌నుంచి వచ్చిన సమాధానం డాన్స్ ‌డైరెక్టర్‌ ‌దేనికి నీకు వచ్చింది చేయి చాలు అన్నారట. నాకు డాన్స్ ‌రాదు నాన్న అంటే… డాన్స్ ‌డైరెక్టర్‌ అం‌దరికి నేర్పేది నీకు చెబితే నువ్వు నీ మార్క్ ‌డాన్స్ ఎలా చేస్తావు అని ఎదురు ప్రశ్న వేస్తే.. ఏమి చెప్పలేక బాబీ సినిమాలో డాన్స్ ‌చేయాల్సి వస్తే టెన్షన్‌ ‌పడే వాడిని అని రిషి చెప్పుకున్నారు. నాన్న అంటే రిషికి చాలా ఇష్టం. బాలీవుడ్‌ ‌లో యాంగ్రీ యోంగ్‌ ‌మెన్‌ల హవా నడుస్తున్న సమయంలో రిషి కపూర్‌ను బాబీతో లాంచ్‌ ‌చేసి బాలీవూడ్‌కి ఒక యంగ్‌ ‌లవర్‌ ‌బాయ్‌ని రాజ్‌ ‌కపూర్‌ ఇచ్చారు. అలాగే నష్టాల నుంచి రాజ్‌ ‌కపూర్‌ ‌కోలుకున్నారు. బాలీవూడ్‌లో పితృస్వామ్య భావజాల యాంగ్రీ యాంగ్‌ ‌మాన్‌ ‌రాజ్యమేలుతుంటే రిషి కపూర్‌ ఒక గిటార్‌ ‌పట్టుకుని అమ్మయిల చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ కనిపించి యాంగ్రీ యాంగ్‌ ‌మాన్‌ ‌హీరోలను తలదన్నే హిట్స్ ఇచ్చే వారు. రిషి కపూర్‌ ‌లవర్‌ ‌బాయ్‌ ‌హీరో కావటం వలన రిషికి హీరోయిన్స్ ‌దొరికేవారు కాదు. అందువలన ఎక్కువ మోసమి ఛటర్జీ లేదా నీతూ సింగ్‌తో నటించారు. ముఖ్యంగా నీతూ సింగ్‌తో అధికంగా నటించి అనక ఇద్దరు కలసి జీవితాన్ని పంచుకున్నారు. తమ రిటైర్మెంట్‌ ‌జీవితాన్ని హాయిగా గడుపుతున్న రిషి నీతులూ 2013లో ‘బేషరమ్‌’ అనే సినిమాలో రిషి కపూర్‌ ఇన్స్పెక్టర్‌ ‌చుల్బుల్‌ ‌చౌతాలాగా నటిస్తే అతని భార్య పాత్రలో హెడ్‌ ‌కానిస్టేబుల్‌ ‌బుల్బుల్‌ ‌చౌతాలాగా నీతు కపూర్‌ ‌నటించి తమ ట్రేడ్‌ ‌మార్క్ ‌దంపతుల మధ్య కొనసాగే హాస్యాన్ని పండించారు.

రిషి నీతూలు 15 హిందీ సినిమాలలో జతగా నటించి మెప్పించారు. నీతూ తర్వాత ఆ స్థాయిలో మాధురి దీక్షిత్‌ ‌రిషితో జతగా నటించారు. ప్రయోగాలు చేయటానికి భయపడే బాలీవుడ్‌ ‌రిషి కపూర్‌ను ఇమేజ్‌ ‌చట్రంలో ఇరికించింది అని చెప్పక తప్పదు. రిషి ఎఫర్ట్ ‌లెస్‌ ‌నటుడు అయినప్పటికీ ఆయనతో ఎక్కువ రొమాంటిక్‌ ‌సినిమాలే చేయించి బాలీవుడ్‌ ‌దర్శకనిర్మాతలు సినిమా వ్యాపారం చేసారు. రిషి కపూర్‌ ‌వయసు మీరినాక కూడా ఆయనతో రొమాంటిక్‌ ‌హీరో పాత్రలు వేయించారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పక తప్పదు రిషి రొమాంటిక్‌ ‌హీరో కావటం వలన కొత్త కొత్త హీరోయిన్స్ ‌కావలసి వచ్చేది. దీనివలన బాలీవుడ్‌లో హీరోయిన్‌ ఉద్యోగాలు బాగా పెరిగాయి. కొత్త అమ్మాయిలకు అవకాశాలు వచ్చాయి. మల్టీ స్టార్‌ ‌ఫిలిమ్స్ ‌చేయటంలో ఏమాత్రం వెనకంజ వేయని భయపడని నటుడు రిషి కపూర్‌. ‌తరచూ సహనటుడు అమితాబ్‌ ‌బచ్చన్‌తో ఎక్కువ సినీ తెరను పంచుకున్నారు. రిషి కపూర్‌ ‘‘అమర్‌ అక్బర్‌ ఆం‌థోనీ’’…. ‘‘కూలీ’’ తో సహా పలు విజయవంతమైన సినిమాలలో నటించారు. అమితాబ్‌ ‌బచ్చన్‌, ‌రిషి కపూర్‌ ‌కలసి చివరిగా ‘‘102 నాట్‌ అవుట్‌’’‌లో నటించారు. ఇది 2012లో వచ్చిన స్పానిష్‌ ‌సినిమా ‘‘ది బాడీ’’ రీమేక్‌. ఇది కామెడీ ప్లాట్‌. ‌బచ్చన్‌.. ‌కపూర్‌ ఇద్దరు తమ స్నేహాన్ని ఈ సినిమాలో జీవింపచేశారు. రిషి కపూర్‌ ‌నటనను రేట్‌ ‌చేయాలి అంటే ఇటీవలి కాలంలో రిషి కపూర్‌ ‌పోషించిన క్యారక్టర్‌ ‌రోల్స్ ‌తప్పకుండ చూడాలి. అగ్నీపథ్‌ ‌రీమేక్‌ ‌లో గ్రే షేడ్స్ ‌వున్నా ముంబై డాన్‌ ‌పాత్ర ఎఫర్ట్ ‌లెస్‌గా నటించి రిషి మెప్పించారు. దో దుని చార్‌.. ‌లవ్‌ ఆజ్‌ ‌కల్‌.. ‌ముల్క్.. ఇలా ఇటీవల చిత్రాలతో గణనీయమైన నటనా ప్రతిభ చూపారు. నేడు లీడ్లో వున్న హీరోలకి మాచో మాన్‌ ‌గా కనిపించాలి అన్న బారం లేదు. కానీ రిషి హీరోగా వున్న సమయంలో పితృస్వామ్య భావజాల హీరోగా కనిపించాలి అన్న బారం వుంది. అయినా కానీ రిషి ఆ బారానికి బలి కానీ నటుడిగా కొనసాగారు. ఇది కచ్చితంగా రిషి కపూర్‌ అచీవ్‌ ‌మెంట్‌ అని చెప్పాలి. రిషి కపూర్‌ ‌సీనియర్‌ ‌నటుల ఒడిలో పెరిగిన నటుడు. పెద్దింటి కుటుంబంలో పుట్టినా కూడా అణుకువ రిషి సొంతం. రిషి చక్కగా పాడతారు కూడా. చాలా సినిమాలలో ట్యూన్‌ ‌రికార్డింగ్‌ అప్పుడు ఆడవారి గొంతుతో కూడా పాట పడేసి మ్యూజిక్‌ ‌డైరక్టర్‌కి సహాయ పడేవారు. గోమాంస లించింగ్‌లు జరిగినప్పుడు చాలా మంది యాంగ్రీ యాంగ్‌ ‌మాన్‌ ‌ముసలి హీరోలుగా బాగా సంపాదించి కిమ్మనకుండా కూర్చుని ఉంటే రిషి కపూర్‌ ‌తన సోషల్‌ ‌మీడియాలో అకౌంట్‌లో పౌరులు ఏమి తినేది రాజ్యం నిర్ణయించటం గురించి ప్రశ్నించారు. రిషి కపూర్‌ ‌ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సిన్మాలు తీస్తున్న వారందరు తీవ్ర బాధలో వున్నారు. రానున్న ఈ సినిమాలన్నిటిలో రిషి కపూర్‌ ‌కారెక్టర్‌ ఆర్టిస్ట్ ‌రోల్స్ ‌చేస్తున్నారు. నేడు సినిమాలలో హీరోయే అంతా హీరోయిన్‌ ‌కొద్దో గొప్పో అన్న పరిస్థితి రాకుండా చూడటంలో రిషి కపూర్‌ ‌క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ ‌పాత్రల పోషణ ఖచ్చితంగా ఉపయోగపడి ఉండేది. ఈ బాధ్యత మిగతా ఆర్టిస్టుల మీద పెట్టి రిషి కపూర్‌ ‌వెళ్లారు అనేది గమనించటమే రిషికి బాలీవుడ్‌ ఇవ్వగలిగిన అసలైన నివాళి.

Leave a Reply