Take a fresh look at your lifestyle.

సమాచార హక్కు చట్టం – సంస్కరణలు

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశంలో సమాచార హక్కు చట్టం -2005 అమల్లోకి రావడం వెనుక మేధావుల సైద్ధాంతిక దార్శనికతలు, స్వచ్ఛంద సంస్థల జనజాగృతులు మరియు ప్రజల వీరోచిత పోరాటోద్యమాల నిర్విరామ కృషి ఎంతగానో ఉంది. ఇంగ్లాండ్‌లో రాజరికానికి మరియు నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా నాటి ప్రజలు ఉద్యమించి 15 జూన్‌, 1215 ‌నాడు మాగ్నాకార్టాను అమల్లోకి తీసుకురావడంలో నిర్విరామ కృషి చేశారు. ఫలితంగా మాగ్నాకార్టా ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగాలలో మానవ హక్కులకు పెద్దపీట వేసి ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడడానికి బలమైన పునాదికి నాంది పలికింది. పరిణామ క్రమంలో 1 మే, 1990 లో రాజస్థాన్‌లో ప్రముఖ మాజీ ఐ.ఎ.ఎస్‌. అధికారిణి అరుణారాయ్‌ ‘‌మజ్దార్‌ ‌కిసాన్‌ ‌శక్తి సంఘటన్‌’ అనే సంస్థను స్థాపించి భారతదేశంలో సమాచార హక్కు చట్టం అమలుకు ప్రజల్లో చైతన్యస్ఫూర్తిని ప్రజ్వలింపచేశారు.

మాగ్నాకార్టా మానవ హక్కులకు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు బలమైన పునాది వేస్తే మజ్దూర్‌ ‌కిసాన్‌ ‌శక్తి సంఘటన్‌ ‌సంస్థ సమాచార హక్కు చట్టం అమలుకు ప్రధాన భూమికను వహించింది. అరుణారాయ్‌తో పాటు ప్రముఖ సామాజిక వేత్త సందీప్‌ ‌పాండే, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌మరియ లోక్‌సత్తా వ్యవస్థాపకులు డా।। జయప్రకాష్‌ ‌నారాయణ్‌ ‌మొదలైన వారందరూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి అహర్షిషలు ప్రజాస్వామిక బాటలో ఉద్యమించడంతో పరిపాలనలో పారదర్శకతకు పెద్దపీట వేయడం, ప్రభుత్వ శాఖలో అవినీతిని అరికట్టడం, ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలు ప్రజలకు జవాబుదారిగా పనిచేయడం … అంతిమంగా ప్రజలకు సుపరిపాలన అందించడం మొదలైన ముఖ్య ఉద్దేశ్యాలుగా 12 అక్టోబర్‌ 2005 ‌న జమ్ము• కాశ్మీర్‌ ‌మినహా భారతదేశంలో సమాచార హక్కు చట్టం -2005 అమల్లోకి వచ్చింది. ఈ రకంగా భారతదేశంలో సమాచార హక్కు చట్టం – 2005 అమల్లోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచిననూ పూర్తి స్థాయిలో ఆశించిన సత్ఫలితాలను పొందలేకపోవడం విచారకరం. దీనికి కారణాలు అనేకంగాను ఉన్నాయి. అందువలన నేను ఈ వ్యాసంలో సమాచార హక్కు చట్టం దరఖాస్తు ప్రక్రియలు తదితర వివరాలకు వెళ్ళకుండా సమాచార హక్కు చట్టం మరింత సమర్ధవంతంగా అమలు కాబడానికి ప్రభుత్వాలు మరియు సమాచార కమిషన్‌• అవలంభించాల్సిన సంస్కరణల వరకు మాత్రమే పరిమితం అయ్యాను. ప్రభుత్వాలు మరియు సమాచార కమిషన్‌• ఈ ‌క్రింది సంస్కరణలను విధిగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి :
1) సమాచార హక్కు చట్టం – 2005 అమల్లోకి వచ్చి 16 సం।।లు గడిచిననూ ఇంకా దేశవ్యాప్తంగా కొద్దిమంది మినహా అత్యధిక ప్రజానీకానికి ఆ చట్టంపై పూర్తి స్థాయి అవగాహన లేదు. అందుకు ప్రభుత్వాల ప్రచార వైఫల్యాలు చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్లు కన్పిస్తున్నాయి. అందువలన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం -2005 యొక్క నేపథ్యం, ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, విధివిధానాలు తీరుతెన్నులు, దరఖాస్తులు చేయు పద్ధతులు, అప్పీల్‌లు చేయు విధానాలు సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానాలు విధించడం, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం మొదలైన అంశాలకు సంబంధించి ప్రజా సమాచార మాధ్యమాల ద్వారా తరచూ విస్త•త స్థాయిలో ప్రసారాలు చేయాలి.తద్వారా ప్రజలకు ఆ చట్టంపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. తత్ఫలితంగా ప్రజలు సమాచార హక్కు చట్టం ప్రసాదించిన హక్కు ద్వారా తమకు కావాల్సిన సమాచారాన్ని త్వరితగతిన పొందడం సులభతరం అవుతుంది.

2) పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విధిగా అక్టోబర్‌ 12 ‌న సమాచార హక్కు చట్టం – 2005 కు సంబంధించిన సదస్సులను విధిగా నిర్వహించాలి. ఫలితంగా విద్యార్థులు ఆ సదస్సుల ద్వారా పొందిన అవగాహన ద్వారా సమాజాన్ని చైతన్యపరిచి అవినీతికి తావులేని నూతన సమాజాన్ని ఆవిష్కరించడానికి ఎంతగానో దోహదపడుతారు.
3) సమాచార హక్కు చట్టంపై సదస్సులు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ నూతన సమాజ ఆవిష్కరణకు దోహదపడుతున్న స్వచ్చంధ సంస్థలకు ప్రభుత్వాలు విధిగా ఆర్థిక సహాయ సహకారాలను అందించాలి.
4) ప్రభుత్వ సంస్థలు ముఖ్యంగా సమాచార హక్కు చట్టంపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న వారిని మాత్రమే ప్రజా సమాచార అధికారులుగా మరియు అప్పిలేట్‌ అధికారులుగా నియమించాలి. అవగాహన లేని అధికారులకు విధిగా తగిన శిక్షణ ద్వారా పూర్తి స్థాయిలో సమాచార హక్కు చట్టంపై అవగాహనను కల్గించాలి.
5) ‘మండల స్థాయిలో రూ.5లను రెవిన్యూ డివిజన్‌ ‌మరియు ఆపై స్థాయిలో రు.10లను దరఖాస్తుతో పాటు విధిగా చెల్లించాలి’ అనే నిబంధనలను రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లోను దారిద్య్ర రేఖకు దిగువగా ఉన్న వారికి ఏ విధంగానైతే ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నారో అదేవిధంగా మిగతా అన్ని వర్గాల వారికి కూడా ఉచితంగానే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలి. అంతిమంగా సమాచారం కొరకు చేసే దరఖాస్తు ప్రక్రియా విధానం అతి సరళంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజలు సమాచారం కోసం దరఖాస్తు చేయడానికి అత్యధిక శ్రద్ధాసక్తులు చూపుతారు.
6) సెక్షన్‌ 4(1)(‌బి) ప్రకారం 17 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని స్వచ్ఛంధంగా వెల్లడించని ప్రభుత్వ సంస్థలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి సమాచారాన్ని వెల్లడించేందుకు తగిన పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.
7. ప్రజలు చెమట చ్కులు చిందించి చెల్లించిన పన్నులతో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రభుత్వ సంస్థల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు తెలుసుకోవడానికి ప్రతి పేజికి రు.2 లను చెల్లించాలని పేర్కొనడం ఏ మాత్రం సహేతు••ం కాదు.  ప్రజలు కాయాకష్టం చేసి పన్నులు కట్టడం వల్ల ప్రభుత్వాలు మనుగడని సాగిస్తున్నాయి. అలాంటి ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని పొందడానికి ప్రతి పేజికి రు.2లను చెల్లించాలనడం ఎంతవరకు సమంజసం? ఆ విధంగా నిబంధనలను రూపొందించడం సమాచార కమిషన్‌• ‌విధానమా? ఈ నిబంధనలు ఏ మాత్రం సహేతుకం కావు. ఇకనైనా ఇలాంటి నిబంధనలను సమాచార కమిషన్‌  ‌రద్దు చేసి ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఎ4,ఎ3 ప్రతుల సమాచారం, సిడి సమాచారం,ప్లాపి సమాచారం, డివిడి సమాచారం మరియు ఏ ఇతర రూపాలలోనూ సమాచారం లక్షల పేజీలలోను ఉన్ననూ ప్రభుత్వమే అన్ని రకాల ఖర్చులను భరించి దరఖాస్తుదారులకు ఉచితంగా అందించాలి. అందుకుగాను సమాచార కమిషన్‌• ‌తగిన పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.

8) దరఖాస్తుదారుడు ప్రభుత్వ సంస్థలలో రికార్డ్‌ల తనిఖీ కోసం ఉచితంగా కేవలం ఒక గంట సమయాన్ని మాత్రమే అనుమతించడం  వల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. మొత్తంగా 5 గంటల పాటు ఉచితంగా రికార్డ్‌లను తనిఖీ చేసుకునే వెసులుబాటును కల్పించాలి. అప్పుడు మాత్రమే దరఖాస్తుదారుడు రికార్డ్‌ల తనిఖీ ప్రక్రియను సక్రమంగా నిర్వహించగలిగి ప్రపంచానికి వాస్తవ విషయాలను ప్రపంచానికి వెల్లడిచేసే అవకాశం ఉంటుంది.
9) ప్రజల కోరిన సమాచారాన్ని నార్వేలో 3 రోజుల్లో, ఇర్లాండ్‌లో 7 రోజుల్లో, అమెరికాలో 10 రోజుల్లో అందిస్తున్నారు. అలాంటిది నేడు మన భారతదేశంలో ఏకంగా 30 రోజులు గడువు ఇచ్చిననూ కొందరు ప్రజా సమాచార అధికారులు ప్రజల దరఖాస్తులను నిర్లక్ష్య ధోరణులతో శీతకన్నుతో చూసీచూడనట్లు వ్యవహరిస్తూ ప్రజల సమాచార హక్కును కాలరాస్తున్నారు. అలాంటి ప్రజాసమాచార అధికారులకు ‘శస్త్ర చికిత్స’ చేయాలి. లేనిచోవారు సమాజాన్ని మరింతగా తిరోగమన దిశలోకి నెట్టుకువెళ్ళే ప్రమాదం పొంచి ఉంది.

10) నిర్దిష్ట 30 రోజుల గడువులోగా సమాచారం అందివ్వని ప్రజా సమాచార అధికారులకు రోజుకు విధంచే జరిమానా రు.250 బదులు రు.1000 చొప్పున గరిష్టంగా ఒక లక్ష రూపాయల వరకు జరిమానాను విధించి వసూలు చేసి దరఖాస్తుదారులకు అందించేందుకు సమాచార కమిషన్‌• ‌తగిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ ప్రజా సమాచార అధికారులపై శాఖాపరమైన చర్యలలో భాగంగా ఇంక్రిమెంట్‌లు నిలిపి వేయడం, పదోన్నతులు నిలిపి వేయడం, సస్పెండ్‌ ‌చేయడం, అవసరమైన పక్షంలో పూర్తిగా ఉద్యోగాల నుండి తొలగించి న్యాయాన్ని, ధర్మాన్ని రక్షించే దిశగా సమాచార కమీషన్‌లు తగిన చర్యలు తీసుకొని కట్టుదిట్టంగా అమలు చేయాలి. అలాంటి కఠిన క్రమశిక్షణా చర్యలను పకడ్బందీగా అమలు పరిస్తేనే ప్రజా సమాచార అధికారులు తమ వృత్తి ధర్మాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు.
11) ఇక నుంచి నిర్దిష్ట 30 రోజుల గడువుకు బదులుగా అమెరికాలో లాగా 10 రోజుల గడువును మాత్రమే ప్రజా సమాచార అధికారులకు ఇవ్వడం అన్ని విధాల సమంజసం ఉంటుంది.

అందుకు గాను సమాచార కమిషన్‌• ‌ప్రజా సమాచార అధికారులకు తగిన ఉత్తర్వులను జారీ చేయాలి. ఫలితంగా 10 రోజులల్లో ప్రజా సమాచార అధికారుల నుండి ఏ విధమైన సమాచార ప్రజలకు అందని పక్షంలో 11వ రోజు నుండి మరో పది రోజులు అనగా 20వ రోజు వరకు అప్పిలేట్‌ అధికారికి మొదటి అప్పీల్‌ ‌చేసుకునే వెసులుబాటుని కల్పించాలి. 20వ రోజు వరకు కూడా అప్పిలేట్‌ అధికారి నుండి పూర్తి స్థాయి సమాచారం దరఖాస్తుదారులకు రాని పక్షంలో 21వ రోజు నుంచే రాష్ట్ర సమాచార కమిషన్‌•‌కు రెండవ అప్పీల్‌ ‌చేసుకునే వెసులుబాటును కల్పించాలి.కమిషన్‌  ‌తమకు అందిన అప్పీల్‌లను నెలల తరబడి కాకుండా కేవలం నెల (30) రోజుల లోపే విచారణలను చేపట్టి తీర్పులను వెలువరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ రకమైన పకడ్బందీ ప్రణాళికను అమలుపరచడం వలన దరఖాస్తు దారుడు కోరిన సమాచార పూర్తిస్థాయిలో అందడానికి, సమాచారం అందివ్వని ప్రజా సమాచార అధికారులకు జరిమానాలు విధించి వసూలు చేయడం మరియు వారిపై శాఖాయుతమైన చర్యలు తీసుకోవడం అనేటటువంటివి 50 రోజుల వ్యవధిలోనే పూర్తి కావడం జరుగుతుంది. తద్వారా దరఖాస్తుదారుల్లో సమాచార హక్కు చట్టపై పూర్తిస్థాయి భరోసా కలుగుతుంది.
12) అక్రమాలు, అవినీతి బండారాలను వెలుగులోకి తీసుకువచ్చి అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తున్న సమాచార హక్కు చట్ట దరఖాస్తుదారులందరికీ విచారణ సందర్భంగా సమాచార కమిషన్‌  ‌కార్యాలయానికి హాజరు కావడానికి అయ్యే ప్రయాణ ఖర్చులను సమాచార కమిషన్‌• ‌నగదు లేదా ఇతరాత్ర రూపాలలో అందించేందుకు తగిన పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.

13) విచారణలకు ప్రజా సమాచార అధికారి/ అధికారులు మరియు అప్పిలేట్‌ అధికారి మొదలైన వారందరూ హాజరైన పక్షంలో మాత్రమే సమచార కమిషనర్‌  ‌విచారణను చేపట్టడం అన్ని విధాల ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా విచారణలో అవాంతరాలు నిరోధించబడి సరియైన రీతిలో ముందుకు కొనసాగం వలన సరైన వాస్తవాలు వెలుగులోకి రావడానికి అవకాశం ఉంటుంది.
14) సమాచార కమిషన్‌లలో జరిగే ప్రతి ఒక్క విచారణను వీడియో తీసి దరఖాస్తుదారులకు వాటిని కాంపాక్ట్ ‌డిస్క్ (‌సిడి)రూపంలో అందించేందుకు సమాచార కమిషన్‌లు తగిన పకడ్బందీ చర్యలను తీసుకోవాలి.
15) విచారణ జరిగిన రోజు సాయంకాలం వరకే దరఖాస్తు దారులకు నిర్ణయ ప్రకటనల (ఆర్డర్‌) ‌యొక్క ప్రతులను మాతృభాషల్లో సమాచార కమిష• అందించేందుకు తగిన పకడ్బందీ చర్యలను తీసుకోవాలి.
16) అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తున్న సమాచార హక్కు చట్ట కార్యకర్తలపై, దరఖాస్తుదారులపై సహించని స్వార్థపరశక్తులు దాడులు చేస్తు అన్యాయంగా వారిని చంపివేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలకు ఏ మాత్రం తావు ఇవ్వరాదు. ఇవి ఏ మాత్రం సమంజసం కావు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.
సమాచార హక్కు చట్టం -2005 పకడ్బందీగా అమలు కావడానికి పైన పేర్కొన్న 16 అంశాలు ఎంతగానో దోహదపడుతాయి. అందుకుగాను ప్రభుత్వాలు మరియు సమాచార కమిష•లు తగిన పకడ్బంది చర్యలను తీసుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. దరఖాస్తుదారులు దరఖాస్తులో కోరిన సమాచారం వందశాతం వారికి అందిన రోజున సమాచార హక్కు చట్టం నిజంగా అమలు అవుతున్నట్లుగా భావించవచ్చును. అప్పుడు మాత్రమే ప్రజల చేతిలో పాశుపతాస్త్రంగా వెలుగొందుతున్న సమాచార హక్కు చట్టానికి తగిన సార్థకత లభిస్తుంది. (అక్టోబర్‌ 12‌న సమాచార హక్కు చట్టం – 2005 అమలులోనికి వచ్చిన సందర్భంగా)                   – జె.జె.సి.పి. బాబూరావు
(సెల్‌ : 9493319690)

Leave a Reply