Take a fresh look at your lifestyle.

పరిహాసాలైన పరిణయాలు

నర’కలోక నవ యువ వారసులు
అధికారికమైన సహజీవన స్నేహాలు
డిజటల్‌ ‌వేదికలపై పరిచయాలు
పరిహాసాలైన శుభ పరిణయాలు !

మంగళసూత్రమే బరువైన దారమై..
పసుపుతాడే మరో ఆభరణమై..
పరాచికాల తంతైన వివాహ వేడుకలు..
మూన్నాళ్ళ ముచ్చట్లైన మూడు ముళ్లు !

తొలి చూపుల్లోనే తీక్షణ మన్మథ కీలలు
మలి చూపున ఏడడుగుల తొందరలు
మర్నాడే మతిలేని విభేధాల కుంపట్లు
ఈజీగా విసిరేసే పసుపు కాళ్ల మట్టెలు !

‘చిత్ర’విచిత్రంగా తెరలపై పెళ్లిళ్లు..
సినిమా కథలైన పవిత్ర పరిణయాలు
పెళ్ళికే కాదు పెటాకులకూ తొందరలు
అగ్నిసాక్షిగా ఒక్కటై, కాగితాల్లో విడాకులు !

హీరో హీరోయిన్‌లే నిజజీవిత విలన్లు
సామాజిక మాద్యమాల్లో పెళ్లి సందడులు
మరునాడే విడాకుల వార్తల వెల్లువలు
మేయిన్‌ ‌పేజ్‌ ‌వార్తలైన పెళ్లి పెటాకులు !

అగ్ని సాక్షిగా జరగాలి వివాహ వేడుకలు
పెటాకుల ఆలోచనలు కావాలి భస్మాలు
విభేదాలు వీడి సర్దుకు పోవాలి మనసులు
నవ్వులపాలు కానే కారాదు కళ్యాణాలు !

సమస్త చైతన్య పెళ్లి మజిలీల శోభలు
సమాజ పెద్దలే సాక్షులుగా దీవెనలు
పాలు నీళ్లలా పెనవేసుకున్న మనసులు
కావాలి రేపటి సకుటుంబ సపరివారాలు !

మారేజెస్‌ ఆర్‌ ‌మేడ్‌ ఇన్‌ ‌హెవెన్‌
‌దేవతల అక్షింతల దివ్య దీవెనలు
వేదమంత్రాలతోనే లగ్గం నాగవెల్లిలు
ఏడడుగులతో ఏకమైన హృదయాలు !

శ్రీ రాముడి ఆదర్శ ఏక పత్నీ వ్రతాలు
సీతమ్మయే కదా రాముడి శ్వాసలు
జానకి రాములే జాతి పుణ్యదంపతులు
ప్రేరణ కావాలి వైదేహీ వివాహ వేడుకలు !

– మధుపాళీ
              కరీంనగర్‌  9949700037

Leave a Reply