Take a fresh look at your lifestyle.

వడగండ్లతో రైతన్నకు కన్నీళ్లు

  • అకాల వర్షంతో వరి, మొక్కజొన్న, మామిడి నేలపాలు
వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లాలోని పలు మండలాల్లో ఆకస్మికంగా కురిసిన వడగండ్ల వానతో రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చాయి. వర్థన్నపేట, రాయపర్తి, జఫరఘడ్‌ ‌మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానతో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. చేతికంది వచ్చిన పంటలు వడగండ్ల వానతో నేలమట్టం కావడంతో రైతన్న గుండెలు గుబేలుమన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వరుణుడి ఆగ్రహంతో నెలమట్టం కావడంతో పెట్టిన పెట్టుబడులు ఎలా తీర్చాలంటూ రైతన్నలు బావురుమన్నారు.
అకాల వడగండ్ల వాన జోరున విసిరిన గాలులతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు కూలి అంతరాయం ఏర్పడింది. అంతేగాకుండా వడగండ్ల వానతో ఇండ్లపై రేకులు కొట్టుకుపోయాయి. గాలి వానతో ఇళ్లముందు వస్తువులు కొట్టుకుపోయాయి. ఏకభిగిన వడగండ్లు కురువడంతో ఇళ్లవాకిళ్లముందు మంచుగడ్డలు పర్చినట్లుగా పడ్డాయి. వడగండ్లతో మామిడి పిందెలు నేలరాలాయి. మరికొద్ది రోజుల్లో కోతకు వచ్చిన వరి పంట నేలపాలైంది. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతన్నలు కోరుతున్నారు.

Leave a Reply