Take a fresh look at your lifestyle.

బియ్యం, రూ.1500 ఇస్తున్నాం

  • అందరూ ఇండ్లకే పరిమితవుదాం…సమాజాన్ని కాపాడుదాం
  • ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువుల పంపిణీలో మంత్రి హరీష్‌రావు

కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో తెల్లకార్డు రేషన్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ 12కిలోల ఉచిత బియ్యం ఇవ్వడంతో పాటు 1500రూపాయల నగదును కూడా ఇస్తున్నామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని కొండా మల్లయ్య గార్డెన్స్‌లో సిద్దిపేట అర్బన్‌, ‌సిద్దిపేట రూరల్‌, ‌నారాయణరావుపేట మండలాలకు చెందిన 700 మంది ఆటో డ్రైవర్లకు, అదే విధంగా సిద్ధిపేటలోని 162 మంది రజకులకు నిత్యావసర వస్తువుల కిట్స్ ‌మంత్రి హరీష్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…కొరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ…వ్యాధి వ్యాప్తిచెందుతున్న దృష్ట్యా…ప్రజలందరూ ఇండ్లకే పరిమితమై సమాజాన్ని కాపాడుకుందామని హరీష్‌రావు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ మాస్క్ ‌తప్పని సరిగా ధరించడంతో పాటు రోడ్లపై ఉమ్మి వేయాకూడదన్నారు.

మంగళవారం సిద్ధిపేటలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువుల పంపిణీలో మాట్లాడుతున్న మంత్రి తన్నీరు హరీష్‌రావు. పక్కన హాజరైన ఆటో డ్రైవర్లను చూడవచ్చు.

లాక్‌డౌన్‌ ‌సందర్భంగా ఇబ్బంది నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ తరపున అన్ని రకాల సరుకులను అందిస్తున్నామన్నారు. ఇది వరకే పేదలందరికీ ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చామనీ, తాజాగా 1500రూపాయల నగదును ఇస్తున్నామన్నారు. అయితే, బ్యాంకులో డిపాజిట్‌ అయిన డబ్బులను సామాజిక దూరం పాటించి తీసుకోవాలన్నారు. బ్యాంకులో ఆగమాగం చేయకూడదనీ, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని హరీష్‌రావు సూచించారు. ఈ కార్యక్రమంలు మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, మార్కెట్‌ ‌కమిటీ ఛైర్మన్‌ ‌పాల సాయిరాం, సుడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్‌, ‌శ్రీకాంత్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!