Take a fresh look at your lifestyle.

వరి, మొక్కజొన్న నిల్వలను గోదాములకు తరలించాలి సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

‌ఖమ్మం  ఏప్రిల్‌ 29 ‌ప్రజాతంత్ర (ప్రతినిధి)  :  ఖమ్మం జిల్లాలో రైతులు పండించిన వరిధాన్యం, మక్కలు కొనుగోలు నిల్వలను గోదాములకు తరలించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం టిటిడిసి భవనంలో మార్కెటింగ్‌, ‌వ్యవసాయం, రవాణా,  మార్కుఫెడ్‌, ‌వెర్‌ ‌హౌసింగ్‌, ‌సివిల్‌ ‌సప్లై, సహకార శాఖ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 59 వేల 932 మెట్రిక్‌ ‌టన్నుల మక్కలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కాంటా వేసిన మక్కలను గుర్తించిన గిడ్డంగులకు సత్వరమే తరలించా)న్నారు. రవాణాకు అవసరమైన 150 వాహనాలను వెంటనే సమకూర్చాలని రవాణా శాఖాధికారులను ఆదేశించారు.

జిల్లాలో వాతావరణ మార్పుల వల్ల కొనుగోలు చేసిన ధాన్యం, మక్కలను గోదాములను వెంటనే తరలించాలన్నారు. మిల్లులకు తరలించిన ధాన్యం దిగుమతిలో మిల్లర్లు అలసత్వం వహించకుండా దిగుమతిచేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ  సమీక్షలో జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఎమ్మెల్సీ బలసాని లక్ష్మీనారాయణ , మేయర్‌ ‌పాపాలాల్‌ , ‌జడ్పీ చైర్మన్‌ ‌లింగాల కమల్‌ ‌రాజ్‌ , ‌విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ ‌కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్‌ ‌రెడ్డి, రాములు నాయక్‌, ‌రైతు సమన్వయ సమితి చైర్మన్‌ ‌నల్లమల వెంకటేశ్వర రావు, మార్కుఫెడ్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌బొర్రా రాజశేఖర్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy