Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలులో అక్రమాలు సహించం మెదక్‌ అదనపు కలెక్టర్‌ ‌నగేష్‌

మెదక్‌ 29 ఏ‌ప్రిల్‌ ( ‌ప్రజాతంత్ర ప్రతినిధి) :  రైస్‌ ‌మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుండి వస్తున్న ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడానికి గాను అదనపు హమాలీలను  సమకూర్చుకోవాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా  కొనుగోలు ప్రక్రియ సాగాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ‌నగేష్‌ ఆదేశించారు.  బుధవారం హవేలీ ఘనపురం మండల కేంద్రం తో పాటు మరియు రామాయంపేట మండలాలలోని  లోని రైస్‌ ‌మిల్లులని  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ ‌మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుండి రైస్‌ ‌మిల్లులకు తరలిస్తున్న ధాన్యం ఆయా మిల్లు వద్ద దిగుమతి కాకుండా అలాగే ఉంటుంది అన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. బీహార్‌ ‌తో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన అమాలి లే కాకుండా స్థానికంగా సైతం హమాలీల ను సమకూర్చుకొని దిగుమతి లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత యజమానులపై ఉందన్నారు.

రైస్‌ ‌మిల్లర్లు ఏ విషయంలో ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యం మిల్లు వద్ద త్వరితగతిన దిగుమతి చేసుకొని తిరిగి సంబంధిత వాహనాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మళ్ళించాలి అన్నారు. అనంతరం హవేలీ ఘనపురం మండల కేంద్రంతో పాటు శమ్నాపూర్‌, ఆవుసులపల్లి, రామాయంపేట మండలం లోని కాట్రియాల,  లక్ష్మాపూర్‌,  ‌తోనిగండ్ల ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ ‌పరిశీలించారు.  ప్రభుత్వం నిర్దేశించిన కనీస ప్రమాణాల మేరకు ఉన్న ధాన్యానీకే  అధికారులు జారీ చేయాలన్నారు. కొనుగోలులో పారదర్శకత పాటించాలని, ఏ రోజు జరిగిన కొనుగోలుకు సంబంధించిన రైతుల వివరాలను అదేరోజు ఆన్లైన్లో అప్లోడ్‌ ‌చేయాలని ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు అదనపు కలెక్టర్‌ ‌సూచించారు.

Leave a Reply