Take a fresh look at your lifestyle.

జార్జ్ ‌రెడ్డికి విప్లవ జోహార్‌

క్యాంపస్‌ ‌క్రాంతి ధార
విద్యార్థి ఉద్యమ ధీర
హైధరాబాద్‌ ‌చెగువేరా
ఉస్మానియా అరుణ తార
అతడే…కామ్రేడ్‌ ‌జార్జిరెడ్డి

దోపిడీ రాజ్యం కూల్చి
సమ సమాజ స్థాపనకు
రణభేరి మోగించినవాడు

అగ్రవర్ణ ఆధిపత్యం మీద
పోరు పిడికిలి ఎత్తినవాడు

మతోన్మాదశక్తుల గుండెల్లో
విప్లవ జెండా దించినవాడు

జీనా హైతో మర్‌ ‌నా సీకో
కదం కదం పర్‌ ‌లడ్నా సీకో
అంటూ నినదించినవాడు

అన్యాయాలు సహించలేక
దహించ పూనుకున్నవాడు

భయమంటే ఎరుగనివాడు
చావును ఎదురించినవాడు
చరిత్ర ఎరుపెక్కించినవాడు

సాహసమే శ్వాసగా
సమానత్వమే లక్ష్యంగా
నక్షల్బరీ బాటలో నడిచి
అమరత్వం అద్దుకున్నవాడు

విప్లవ సూరీడు అస్తమించి
అర్ధశతాబ్దమైన సందర్బంగా

ఆ స్ఫూర్తి యువతకు ప్రబోధిద్దాం
ఆ ఆశయ సాధనకు సంకల్పిద్దాం

కామ్రేడ్‌ ‌జార్జ్ ‌రెడ్డికి
అరుణారుణ వందనాలు
విప్లవోద్యమ జోహారులు

(ఏప్రిల్‌ 14 ‌కామ్రేడ్‌ ‌జార్జిరెడ్డి వర్దంతి సందర్బంగా..)
  కోడిగూటి తిరుపతి :9573929493.

Leave a Reply