పటాన్చెరు, సెప్టెంబర్ 29 (ప్రజాతంత్ర విలేఖరి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెడుతున్న భూ చట్టాలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టపోతున్నాయని పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం తెల్లపుర్ మున్సిపల్ చైర్మన్ మల్లేపల్లి లలితా సోమిరెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో పేదవాళ్లు నిర్మించుకున్న ఇళ్ళ వివరాలను సేకరించాలని సూచించారు. ప్రభుత్వం భూముల పరిరక్షణకై తెస్తున్న నూతన చట్టాలు భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూడతాయని అన్నారు. గజం భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా నూతన చట్టం పని చేస్తుందని అన్నారు. మున్సిపల్ పరిధిలో ఎల్ఆర్ఎస్ పరిధిలోకి వచ్చే ప్రతి ప్లాట్ ని క్రమబద్ధీకరణ చేసేలా అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ బి.రాములు గౌడ్, కమిషనర్ వెంకట మనికరణ్, కౌన్సిలర్లు పట్లోళ్ల రవీందర్ రెడ్డి, శ్రీశైలం, శంషాబాద్ రాజు, పావని,భారత్,చిట్టి ఉమేశ్వర్,తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికే నూతన చట్టాలు
ప్రతి పేదవాడి ఆస్తి పరిరక్షణకు ప్రభుత్వం నూతన చట్టాలు తీసుకుని వస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో పేదవాళ్లు నిర్మించుకున్న ఇళ్ళ వివరాలను సేకరించాలని సూచించారు. ప్రభుత్వం భూముల పరిరక్షణకై తెస్తున్న నూతన చట్టాలు భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూడతాయని అన్నారు. గజం భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా నూతన చట్టం పని చేస్తుందని అన్నారు. మున్సిపల్ పరిధిలో ఎల్ఆర్ఎస్ పరిధిలోకి వచ్చే ప్రతి ప్లాట్ ని క్రమబద్ధీకరణ చేసేలా అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు పాల్గొన్నారు.