Take a fresh look at your lifestyle.

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు

అమరావతి, : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ ‌విధానం ద్వారా పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనప్లలె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ, ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 2023 నాటికి మెడికల్‌ ‌కాలేజీల నిర్మాణం పూర్తి చేసేలా ఎ•-లాన్‌ ‌సిద్ధం చేశారు. రూ.7880 కోట్లతో 14 మెడికల్‌ ‌కాలేజీల నిర్మాణం చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్‌ ‌తెలిపారు. మెడికల్‌ ‌కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. మెడికల్‌ ‌కాలేజీలకు అనుబంధంగా 500 పడకల ఆస్పత్రులను నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రతి పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలో సూపర్‌ ‌స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ ‌క్లినిక్‌ ఉం‌టుందన్నారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటారని సీఎం జగన్‌ ‌పేర్కొన్నారు. పేదవారికి వైద్య సేవలను అందుబాటు లోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్‌ ‌పరిధిలోనూ టీచింగ్‌ ‌మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్‌ ‌కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్‌ ‌కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్‌ ‌కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పులివెందుల, పాడేరులో మెడికల్‌ ‌కాలేజీల పనులు జరుగుతున్నాయని.. కొత్త మెడికల్‌ ‌కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని సీఎం వెల్లడించారు. మెడికల్‌ ‌కాలేజీల నిర్మాణాలకు దాదాపు రూ.8వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదవారికి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే మెడికల్‌ ‌కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, పెనుకొండ, నంద్యాల, ఆదోని, పాడేరు, పులివెందులలో మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని‘ సీఎం తెలిపారు. మెడికల్‌ ‌కాలేజీలతోపాటు 500 పడకల ఆస్పత్రులు కూడా ఏర్పాటు చేస్తున్నాం.

అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలల నిర్మాణం చేపడుతున్నాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ వైఎస్‌ఆర్‌ ‌విలేజ్‌ ‌క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలను తీసుకొస్తున్నాం. రూ.246 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో గణనీయమైన మార్పులు చేశాం. 2,436 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేశామని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెన్షన్‌ అం‌దిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కోవిడ్‌ ‌వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చామని.. రెండేళ్లలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ‌ద్వారా రూ.5,215 కోట్లు చెల్లించామని సీఎం జగన్‌ ‌తెలిపారు.

Leave a Reply