Take a fresh look at your lifestyle.

రద్దు చేసిన వర్కింగ్‌ ‌జర్నలిస్టుల చట్టాన్ని పునరుద్దరించాలి

Revoke the repealed Working Journalists Act
టియుడబ్ల్యూజే(ఐజెయు)జిల్లా అధ్యక్షులు అబ్దుల్‌ ‌రెహమాన్‌

‌ ప్రభుత్వం రద్దు చేసిన వర్కింగ్‌ ‌జర్నలిస్టు చట్టాన్ని వెంటనే పునరుద్దరించాలని తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షులు అబ్దుల్‌ ‌రహమాన్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా టియుడబ్ల్యూజె ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయంలో ఏఓ రహమతుల్లాకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు రెహమాన్‌ ‌మాట్లాడుతూ ప్రైవేటీకరణ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోందని ఆరోపించారు. కార్మిక హక్కుల చట్టాలను నిర్వీర్యం చేసేందకు  కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వర్కింగ్‌ ‌జర్నలిస్టు చట్టాన్ని రద్దు చేయడం అన్యాయమన్నారు.

వర్కింగ్‌ ‌జర్నలిస్టులను సినిమా ట్రాన్స్ ‌పోర్టు వర్కర్లతో పోల్చడం సిగ్గు చేటన్నారు. కోడు చట్టంతో జర్నలిస్టుల రక్షణను కాకులను పొట్టి గడ్డలకు వేసినట్టు అయిందని ఎద్దేవా చేశారు. కార్మికుల కోసం ఉన్న చట్టాలని నిర్వీర్యం చేస్తే  కార్మిక లోకమంతా ఐక్యతతో ప్రభుత్వాల పై పోరాటాలకు సిద్దం కావాల్సి వస్తుందని కార్మిక లోకం తో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నిలువని ఆయన అన్నారు. కార్మిక వ్యతిరేక విధావలను విరమించుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం అవుతాయని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో అక్రిడేషన్‌ ‌కమటి మెంబర్‌ ‌ప్రకాష్‌గౌడ్‌,‌టియుడబ్ల్యూజె జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణంరాజు,కోశాధికారి ఆడప సతీష్‌,‌పాత్రికేయులు దేవునూరి రమేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Tags: Revoke ,repealed Working, Journalists Act, tuwj abdul rehaman

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply