Take a fresh look at your lifestyle.

రైతును పరామర్శ

బూర్గంపాడు మండల పరిధిలోని  టేకులచెరువు గ్రామంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి బండారి రవికీ చెందిన రెండు ఎద్దులు మృతి చెందాయి.అట్టి విషయం తెలుసుకొని సంఘటన జరిగిన దగ్గరికి వెళ్లి బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,ఎంపీపీ కైపు రోసిరెడ్డి రైతుని పరామర్శించారు. అనంతరం జడ్పీటీసి,ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందించేందుకు కృషి చేస్తామని రైతుకు హామీ ఇచ్చారు.వారి వెంట మండల తెరాస నాయకులు కామిరెడ్డి రామకొండా రెడ్డి,వెటర్నరీ డాక్టర్‌ ‌రవీందర్‌,‌సొసైటీ డైరెక్టర్‌ ‌లింగయ్య,పాండవుల దర్గయ్య,జక్కుల రాంబాబు తదితరులు ఉన్నారు.

Leave a Reply