Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో … పూర్తి స్థాయిలో కొరోనా చికిత్స అందించాలి

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో కొరోనా చికిత్స అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌సూచించారు.  అలాగే, జిల్లా ఆసుపత్రులలో తక్కువ లక్షణాలున్న వారికి చికిత్స అందించాలని పేర్కొన్నారు. సోమవారం మంత్రి వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, డీఎంఈ డా.రమేశ్‌ ‌రెడ్డితో పాటు అన్ని జిల్లా ఆసుపత్రుల సూపరింటెంటెంట్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పాజిటివ్‌ ఉం‌డి లక్షణాలు లేని వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచాలని ఆదేశించారు.

ఆసుపత్రుల్లో ఏ కొరత లేకుండా చూడాలనీ, మీరు ఏది కోరితే అది ఒక్క రోజులోనే అందిస్తామని స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రిలో నర్సులు పేషెంట్లకు అన్నం తినిపిస్తున్నారనీ, ఈ సేవ మీకు పుణ్యం వస్తుందని చెప్పారు. మహబూబ్‌నగర్‌ ‌సూపరింటెండెంట్‌ ‌జిల్లా ఆసుపత్రి క్వార్టర్‌లోనే ఉంటూ రోగులకు అందుబాటులో ఉంటున్నందుకు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అన్ని జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు కూడా జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.

Leave a Reply