Take a fresh look at your lifestyle.

త్వరలో 4 టిమ్స్ ‌హాస్పిటల్స్‌కు సీఎం కేసీఆర్‌ ‌శంకుస్థాపన

  • జనవరిలో వరంగల్‌ ‌మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మాణం ప్రారంభించాలి
  • ఈనెలాఖరు లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి
  • 8 మెడికల్‌ ‌కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
  • వైద్యారోగ్య, ఆర్‌ అం‌డ్‌ ‌బి అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి: సీఎం కేసీఆర్‌ ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్‌ ‌మల్టీ స్పెషాలిటీ నిర్మాణ పనులను జనవరి నెలలో ప్రారంభించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌ ‌రావు ఆదేశించారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ‌నగరం నలుమూలలా నిర్మించనున్న 4 టిమ్స్ ‌హాస్పిటల్స్‌కు సీఎం కేసీఆర్‌ ‌త్వరలోనే శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. మంత్రి హరీశ్‌ ‌రావు సోమవారం మెడికల్‌ ‌కాలేజీల నిర్మాణాలపై వైద్యారోగ్య, ఆర్‌ అం‌డ్‌ ‌బి అధికారులతో బీఆర్కే భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.1100 కోట్లతో వరంగల్‌ ‌మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలన్నారు.

ఇదే సమయంలో నూతనంగా నిర్మించే 8 మెడికల్‌ ‌కాలేజీల నిర్మాణాన్ని సైతం వేగవంతం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ‌జిల్లాకో మెడికల్‌ ‌కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పారు. వరంగల్‌ ‌మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మాణం పూర్తయితే రాష్ట్రం మెడికల్‌హబ్‌గా మారుతుందన్నారు. నేషనల్‌ ‌మెడికల్‌కమిషన్‌ ‌నిబంధనల ప్రకారం అన్ని కాలేజీలకు శాశ్వత భవనాలు ఉండాలన్నారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా భవనాలు ఉండాలనీ, స్థలం వృధా కాకుండా అన్ని వసతులు ఉండేలా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఎన్‌ఎం‌సి నిబంధనల ప్రకారం నిర్ధిష్ట డిజైన్లు ఉండాలన్నారు.ఆధునిక పద్దతులతో, మెరుగైన వైద్య సదుపాయాలు ఉండేలా రూపొందించాలన్నారు.

ఎయిమ్స్ ‌తరహాలో టిమ్స్
‌సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు టిమ్స్ ‌తరహాలో హైదరాబాద్‌ ‌నలువైపులా నాలుగు సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రభుత్వం నిర్మించనుంది. గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, అల్వాల, సనత్‌నగర్‌లో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి.ఢిల్లీలోని ఎయిమ్స్ ‌తరహాలో టిమ్స్ ‌సేవలు ఉండాలనీ, ఒక్కోటి సుమారు 1000 పడకలు ఉండాలని సీఎం కేసీఆర్‌ ‌వీటికి శంకుస్థాపన సైతం త్వరలోనే చేయనున్నారు.

Leave a Reply