Take a fresh look at your lifestyle.

రెవెన్యూ మొబిలైజెషన్‌, ‌ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల..

  • కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీల వరుస సమావేశాలు
  • కమిటీల ప్రాథమిక నివేదికలను సిఎంకు సమర్పించాలని నిర్ణయం
  • ప్రభుత్వ వైద్యసేవల మెరుగుపై కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ప్రాథమిక సమావేశం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్‌రావు అధ్యక్షతన రెవెన్యూ మోబిలైజేషన్‌పై కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ బిఆర్‌కెఆర్‌ ‌భవన్‌లో గురువారం సమావేశమైంది. సబ్‌ ‌కమిటీ సభ్యులు మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కెటి రామారావు, ఎక్సైజ్‌ ‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌, ఆర్థిక శాఖ సలహాదారు డా. జిఆర్‌ ‌రెడ్డిలు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో రెవెన్యూ మోబిలైజేషన్‌పై అధికారులు వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. సబ్‌ ‌కమిటీ వారి ప్రతిపాదనలపై చర్చించి, వివిధ స్టేక్‌ ‌హోల్డర్స్‌తో సంప్రదింపులు జరిపిన తరువాత ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావుకు సమర్పించాలని నిర్ణయించింది.

ఈ సమావేశంలో ఇంకా భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ ‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావు, మున్సిపల్‌ ‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ ‌కుమార్‌, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ ‌రంజన్‌, ‌రిజిస్ట్రేషన్‌ ‌స్టాంపుల శాఖ సిఐజి వి శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి డా. టికె శ్రీదేవి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ ‌రోస్‌, ఎక్సైజ్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌సర్పరాజ్‌ అహ్మద్‌ , ‌వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ ‌నీతూప్రసాద్‌, ‌సిసిఎల్‌ఏ ‌స్పెషల్‌ ఆఫీసర్‌ ‌సత్యశారద తదితర అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ సమావేశం
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన బిఆర్‌కెఆర్‌ ‌భవన్‌లో గురువారం సమావేశమైంది. ప్రైవేటు పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను సమకూర్చడానికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ చర్చించింది. కమిటీ తన సిఫార్సులను తదుపరి సూచనలను కోసం ముఖ్యమంత్రికి సమర్పించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో మంత్రులు టి హరీష్‌ ‌రావు, కెటి రామారావు, ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్యసేవల మెరుగుపై కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ప్రాథమిక సమావేశం
సిఎం కె.చంద్రశేఖర్‌ ‌రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ దవాఖానాల పనితీరును విశ్లేషించి మెరుగుపరచేందుకు ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం గురువారం బిఆర్‌కెఆర్‌ ‌భవన్‌లో ఆర్థిక మంత్రి టి హరీష్‌ ‌రావు అధ్యక్షతన ప్రాథమిక సమావేశం జరిగింది. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సదుపాయాలు, అందిస్తున్న వైద్య సేవలు గురించి కమిటీ కూలంకషంగా చర్చించింది. పేద ప్రజలకు ప్రభుత్వ సాధారణ వైద్య సేవలతో పాటు ప్రత్యేక వైద్య చికిత్సలను మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో కమిటీ చర్చించింది.

ఈ సమావేశంలో కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ సభ్యులు తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌జి జగదీశ్‌ ‌రెడ్డి, వి.శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ‌డైరెక్టర్‌ ‌డా. రమేష్‌ ‌రెడ్డి, పబ్లిక్‌ ‌హెల్త్ ‌డైరెక్టర్‌ ‌డా.జి.శ్రీనివాస్‌ ‌రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డి డా. గంగాధర్‌, ‌టిఎస్‌ఐఐసి ఎండి చంద్రశేఖర్‌ ‌రెడ్డి, కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌ ‌విసి డా.కరణాకర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply