Take a fresh look at your lifestyle.

పివి వ్యక్తిత్వాన్ని తెలిపే.. ఆయన జీవితం లోని కొన్ని ఘటనలు..

“పివి భారతదేశానికి ఆర్ధిక సంస్కరణల పితామహుడు.  1991 సంవత్సరంలో అప్పుల భారంతో దేశ ఖజానా దివాళా తీయడానికి సిధ్ధంగా ఉన్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పివి ప్రపంచం నివ్వెరపోయేంతగా సంక్స్కరణలను ప్రవేశపెట్టి ‘‘పడి లేచిన కెరటం’’ అని ఆర్ధిక రంగంలో విమర్శకులచే ప్రశంశలు అందుకున్న మేరునగధీరుడు పివి.  ఈయన చేసిన సంస్కరణల కారణంగా దేశీయ బ్యాంకులు ఆర్ధిక మంత్రిత్వ శాఖ నుండి భారతీయ రిజర్వ్ ‌బ్యాంకు నియంతృత్వంలోకి వెళ్లాయి.  ఇలా చేయడం వల్ల 1992 లోనే కాదు, పివి పరమపదించినాక సైతం 2008లో వచ్చిన ఆర్ధిక మాంద్యం భారతీయ బ్యాంకులకు అంటకుండా కాపాడుకోగలిగింది మన దేశం.”

‘‘1996 వేదికపై నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రముఖులతో కరచాలనం చేయడానికి వెళ్ళాను. ముందుగా పివి నరసింహ రావు గారి దగ్గరకు వెళ్ళి చేయి అందించాను. వారూ చేతులు కలిపారు.. ఐతే ఎవరికీ తెలియని విచిత్రం ఒకటి జరిగింది అక్కడ. మా ఇద్దరి చేతులు కలిసినప్పుడు ఒక ‘‘చీటీ’’ ఒకటి పివి గారు నా చేతిలోకి పంపారు. అంతే చాకచక్యంగా దాన్ని నా జేబులోకి చేర్చాను. తరువాత అది తెరిచి చూశాను, అందులో ‘‘ఆయుధం సిధ్ధంగా ఉంది.. ఎప్పుడయినా పరీక్షించుకోవచ్చు’’ అని ఉంది. ఈ మాటలు చెప్పింది మాజీ ప్రధాని స్వర్గీయ అటల్‌ ‌బిహారీ వాజపయి గారు స్వర్గీయ పివి నరసింహ రావు చనిపోయాక సంస్మరణ సభలో ‘‘భారత దేశ అణుబాంబు సామర్ధ్యం’’ వెనుక ఉన్న అసలు వ్యక్తి పివి నరసింహ రావు గురించి చెప్పిన సత్యం. అందరూ అనుకున్నట్టు అణు సామర్ధ్యం క్రెడిట్‌ ‌పూర్తిగా భారతీయ జనతాపార్టీది కాదని, దానివెనుక పివి ఉన్నారని, ఇది కాంగ్రెస్‌ ‌కు కుడా తెలియదని ప్రపంచానికి చాటిచెప్పిన సంఘటన. చీపురు పుల్లంత గొప్ప పని చేస్తేనే కొండంత పబ్లిసిటీ కొట్టేయాలనే ఉద్దేశంతో ఉండే నేటి రాజకీయ నాయకుల తీరుకు పివి నరసింహ రావు కనుచూపు మేరలో సైతం అందని ఓ ఎవరెస్టు శిఖరమని వాజ్‌ ‌పాయ్‌ ఆ ‌బ్రహ్మ రహస్యాన్ని తెలిపేదాకా భారత రాజకీయ నాయకులు, ప్రజలు సైతం గుర్తించలేని స్థితి. ఒకవేళ పివి నరసింహ రావు కు సంబంధించిన ఈ బ్రహ్మ రహస్యాన్ని వాజ్‌ ‌పాయ్‌ ‌సమాజానికి తెలుపకపోయి ఉంటే అణు బాంబు లాంటి దేశ రక్షణకు సంబంధించిన అతి గొప్ప సామర్థ్యాన్ని పివి చెంది ఉండేదే కాదు. రాజకీయాలలో నైతిక విలువలకు, రాజనీతిజ్ఞతకు నిలువుటద్దంగా, కొలమానంలా పివి నరసింహ రావును గుర్తించవచ్చునానడానికి ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉంటాయి.

అసలు భారత ఆర్ధిక వ్యవస్థ గురించి మాట్లాడాలంటే పివి నరసింహ రావుకు ముందు, పివి నరసింహ రావుకు తరువాత అని చెప్తారు ప్రపంచ ఆర్ధిక నిపుణులు. ‘‘రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, శాస్వత మితృత్వం ఉండదు’’ అని ఒక సందర్భంలో ఈయన చెప్పిన సమాధానం ఇప్పటికీ పతాక శీర్షికలను అంటుతూ ఇప్పటి రాజకీయ నాయకులకు ఈ నానుడి ఒక సౌకర్యంలా మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో. పివి భారతదేశానికి ఆర్ధిక సంస్కరణల పితామహుడు. 1991 సంవత్సరంలో అప్పుల భారంతో దేశ ఖజానా దివాళా తీయడానికి సిధ్ధంగా ఉన్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పివి ప్రపంచం నివ్వెరపోయేంతగా సంక్స్కరణలను ప్రవేశపెట్టి ‘‘పడి లేచిన కెరటం’’ అని ఆర్ధిక రంగంలో విమర్శకులచే ప్రశంశలు అందుకున్న మేరునగధీరుడు పివి. ఈయన చేసిన సంస్కరణల కారణంగా దేశీయ బ్యాంకులు ఆర్ధిక మంత్రిత్వ శాఖ నుండి భారతీయ రిజర్వ్ ‌బ్యాంకు నియంతృత్వంలోకి వెళ్లాయి. ఇలా చేయడం వల్ల 1992 లోనే కాదు, పివి పరమపదించినాక సైతం 2008లో వచ్చిన ఆర్ధిక మాంద్యం భారతీయ బ్యాంకులకు అంటకుండా కాపాడుకోగలిగింది మన దేశం. 1991 వరకూ ఫారెన్‌ ‌పాలసీ అంటే అమెరికా, బ్రిటన్‌ ‌వగైరా దేశాల పెత్తనానికి వంతపాడడంగానే ఉండేదట, కానీ ‘‘మనం విలువనిచ్చే చోటు కన్నా మనకి విలువ ఉండే చోటు మనకి శ్రేయస్కరం’’ అని చెప్పి ‘‘•••ఖ జు••• •••ו•’’ అని భారతదేశానికి పరిచయం చేసిన గొప్ప రాజనీత్ఞిడు పివి. దీనివల్ల మన సంస్కృతికి దగ్గరగా ఉండే ఇండోనేషియా, జపాన్‌, ‌తైవాన్‌, ‌మయన్మార్‌ ‌లాంటి చిన్న చిన్న దేశాలతో వాణిజ్యం అన్ని రకాలుగా లాభించి భారతదేశాన్ని నాయక దేశంగా ఆసియా ఖండంలో నిల్చునేట్టు చేసింది. గొప్ప విద్యావేత్త అయినా పివి నరసింహ రావు 16 భాషలలో పండితుడని ప్రతీతి. కవి సామ్రాట్‌ ‌విశ్వనాధ సత్యనారాయణ గారి ‘‘వేయి పడగలు’’ని హిందీ లోకి అనువదించారు ఈయన.

పివి గురించి చెప్పుకుంటూ పోతే మహా గ్రంధమే తయారవుతుంది.. కానీ ఓ వ్యాసంలో క్లుప్తంగా ఆయన గురించి విస్తరించాలంటే కొన్ని ముఖ్యమైన ఘటనలు, వాస్తవాలు మాత్రమే చెప్పాలి కదా.. అందుకే పివి గురించిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రమే తెలుసుకుందాం.. రాజకీయాలంటేనే వివాదాలకు కేంద్ర బిందువు. స్వపార్టీలోనే అసమ్మతినెదుర్కొని, వెన్నుపోట్లకు బలయ్యే అనేక మంది రాజకీయ నాయకులను మనం చూసాం. కానీ, స్వపార్టీలోనే కాదు విపక్ష పార్టీల నాయకులకు సైతం ఆదర్శప్రాయంగా నిలిచే రాజకీయ నాయకులను మనం చూశామా? అని ప్రశ్నించుకుంటే వెలువడేవి పివి నరసింహ రావు ఆతర్వాత పర పార్టీ సహనం కలిగిన అటల్‌ ‌బిహారీ వాజ్‌ ‌పాయ్‌ ‌లాంటి ఉద్దండుల పేర్లు మాత్రమే. దేశాన్ని మార్చే శక్తి, సంస్కరణలు, చట్టాలు చేసే శక్తి, దేశం మొత్తం భవిషత్‌ ‌చిత్రాన్ని మార్చే శక్తి భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకే ఉంది. ఈ స్వాతంత్య్రాన్ని పివి నరసింహ రావు సమగ్రంగా ఉపయోగించుకున్నారనే చెప్పాలి. ఆయన చేసిన ఆర్ధిక సంస్కరణలు ప్రపంచం గుర్తించాక గానీ భారత దేశం, ముఖ్యంగా అయన పుట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించలేదు. సంస్కరణలు, చట్టాలు, నిర్ణయాలు అమలు చేసిన వెనువెంటనే వాటి అసలైన ఫలాలు పొందలేము అనడానికి పివి చేసిన ఆర్థిక సంస్కరణలు, చట్టాలే నిదర్శనంగా చెప్పుకోవాలి. అందుకే పీవీని ‘‘ఫాదర్‌ అఫ్‌ ‌రిఫార్మస్’’‌గా దేశంతో పాటు ప్రపంచమే కీర్తించింది. భారత దేశ 9వ ప్రధానిగా పని చేసిన పివి గురించిన ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. పివి నరసింహ రావు ఒకప్పటి హైదరాబాద్‌ ‌రాష్ట్రమైన నేటి తెలంగాణ రాష్ట్రంలోని ఓ సామాన్య రైతు కుటుంభంలో జన్మించారు. భారత స్వాతంత్రానికి పూర్వం పివి నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడే గొరిల్లా పోరాట యోధునిగా శిక్షణ పొందారు. 1947 ఆగస్టు 15 న భారతదేశం స్వాతంత్య్రం జరుపుకుంటున్న వేళ, పివి నేతృత్వం లోని గెరిల్లా యోధుల బృందం ఒక అడవిలో నిజాం బుల్లెట్లకు ఎదురొడ్డి పోరాడి నిజాం రజాకార్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. పివి బహుభాషాకోవిదుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగుతో పాటు మరాఠీ, ఉర్దూ, ఒరియా, తమిళ్‌, ‌సంస్కృతం లాంటి భారత భాషలతోపాటు ఇంగ్లీష్‌, ‌ఫ్రెంచ్‌, ‌జర్మన్‌, ‌స్పానిష్‌, అరబిక్‌, ‌పెర్షియన్‌ ‌లాంటి విదేశీ భాషలలో ప్రావీణ్యం సాధించారు.

పివి 1991 నాటికి క్రియాశీల రాజకీయాల నుండి దాదాపుగా రిటైర్‌ అయ్యారు, కాని రాజీవ్‌ ‌గాంధీ హత్య తర్వాత తిరిగి క్రియాశీల రాజకీయాలకు వచ్చారు. దేశంలో మొట్టమొదటి దక్షిణ భారత దేశ ప్రధానిగా పివి చరిత్రకెక్కారు. అంతే కాకుండా గాంధీ నెహ్రూల వారసత్వ రాజకీయ నాయకుల తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలో సైతం 5 సంవత్సరాల పూర్తి పదవీ కాలాన్ని ప్రధానిగా పూర్తి చేసిన మొట్ట మొదటి కాంగ్రెస్‌ ‌ప్రధాని పివినే. ‘‘ఫాదర్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ఎకనామిక్‌ ‌రిఫార్మస్’’, ‘‘ఆర్కిటెక్ట్ ఆఫ్‌ ‌మోడరన్‌ ఇం‌డియా’’ అని కీర్తించబడిన పివి చేసిన సంస్కరణల ఫలితంగా అనేక వడ్డీ రేట్లు తగ్గించబడడమే కాక, భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే గుత్తాధిపత్యాలకు ముగింపు పలకడం జరిగింది. విపక్ష నేత ఎల్‌.‌కె. అధ్వాని చేత భారత దేశ ఉత్తమ ప్రధానులలో ఒకరిగా కీర్తించబడ్డారు పివి. పివి తన సెమి ఆటోబయోగ్రఫీ ‘‘ది ఇన్సైడర్‌’’ ‌ను అతని బలమైన రాజకీయ ప్రత్యర్థి, అప్పటి ప్రధాన మంత్రి అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి చేత విడుదల చేయించుకున్నారు. కాశ్మీర్‌కు సంబంధించి భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ ‌మాట్లాడుతున్న నాటి మానవ హక్కుల సమావేశంలో, పాకిస్థాన్‌ ‌ధోరణికి భిన్నంగా దేశ రక్షణ రీత్యా పాకిస్థాన్‌ ‌కు స్నేహ హస్తాన్ని అందించారు. 5 సంవత్సరాలు ప్రధాన మంత్రి పదవిలో ఉన్నప్పటికీ స్వార్థంతో ధనార్జనకు పాల్పడలేదు. ఇందుకు తన కుమార్తె వైద్య విద్య కోసం ఫీజు చెల్లించడంలో ఆయన పడ్డ ఇబ్బందులే నిదర్శనమని ఆయన సన్నిహితులు తెలుపుతుంటారు. వారసత్వ రాజకీయాలపై తన వ్యతిరేకతను బాహాటంగానే చాటారు పివి. ‘‘రైలు ఇంజిన్‌కు కంపార్ట్‌మెంట్ల మాదిరిగా కాంగ్రెస్‌ ‌పార్టీని నెహ్రూ-గాంధీ కుటుంబానికి మాత్రమే ఎందుకు అంటగట్టాలి?’’ అని ఒకానొక సందర్భంలో స్టేట్మెంట్‌ ఇచ్చారట. బహుశా ఈ స్టేట్మెంట్‌ ‌మూలంగానే 2004 లో గుండెపోటుతో ఢిల్లీ లో చనిపోయిన పివి భౌతికకాయానికి ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో నివాళులు సైతం అనుమతించకుండా, ప్రధానులకు జరగాల్సిన లాంఛనంగా పద్ధతుల్లో ఢిల్లీలో అంత్య క్రియలు జరపకుండా కాంగ్రెస్‌ ‌పెద్దలు అడ్డుకుని ఉంటారు. అప్పటి కారణాలు ఏమైనా అయి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, పివి పరమపదించిన 10 సంవత్సరాలకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌.‌డి.ఏ ప్రభుత్వం పీవీకి ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం.

న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, అన్నింటికంటే మించి గొప్ప సంస్కరణల పితామహుడిగా, ఆత్మీయ వ్యక్తిత్వం కలిగి భారతదేశాన్ని ఆర్ధిక వృద్ధి మార్గంలోకి నడిపించిన పి.వి. నరసింహారావు దేశం కోసం చాలానే చేసినప్పటికీ, పాపం ఆయనకు సరైన గౌరవం, గుర్తింపును దక్కలేదనే చెప్పాలి. కానీ ఆయన సంస్కరణల ఫలితాలు ఆయన గొప్పతనాన్ని చాటి, బౌతికంగా మన మధ్య లేని మహానుభావుల మధ్య ఆయనను ప్రస్తుతం దేశం కీర్తిస్తోంది. దేశ మహనుభావులలో ఒకరైన తెలుగు ప్రధాని పివి శత జయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ సర్కార్‌ ‌ను తెలుగు ప్రజలందరూ హృదయపూర్వకంగా అభినందించాల్సిందే. పివి శత జయంతి ఉత్సవాలకు ఈ వ్యాసం అంకితం.
– శ్రీనివాస్‌ ‌గుండోజు,పాత్రికేయులు, ఫోన్‌: 9985188429

Leave a Reply