Take a fresh look at your lifestyle.

సైదాబాద్‌ ‌బాలిక కుటుంబానికి రేవంత్‌ ‌రెడ్డి పరామర్శ

నిందితుడిని ఇంకా ఎందుకు అరెస్ట్ ‌చేయలేదని మండిపాటు
‌సైదాబాద్‌ ‌బాలిక కుటుంబ సభ్యులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి పరామర్శించారు. చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని ఇంకా ఎందుకు అరెస్ట్ ‌చేయలేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నీచంగా వ్యవహరిస్తుందన్నారు. గిరిజనులకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. గిరిజన బిడ్డలు తెలంగాణ కోసం పోరాటం చేశారని ఆయన గుర్తుచేశారు. గంజాయి మత్తులో ఓ దుర్మార్గుడు చిన్నారిని హత్యాచారం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని ఎన్‌కౌంటర్‌ ‌చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. న్యాయం జరిగేవరకూ పోరాడతామన్నారు. చిన్నారి కుటుంబాన్ని అమిత్‌ ‌షా పరామర్శించాలన్నారు.

Leave a Reply