అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో వేదాశీర్వచనం
గాంధీభవన్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో వేదంపడితుల ఆశీర్వచనాల మధ్చ రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పందితులు మంత్రాలు పఠిస్తూ ముందుగా రేవంత్‌ను దీవించారు. అనంతరం పూలమాలలను ధరింప చేశారు. అనంతరం ఆయన ఉత్తమ్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అతిరథులంతా పాల్గొన్నారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు ఆయన తన ఇంట్లోనుంచి బయలుదేరేముందు వేదాశీర్వచనం తీసుకున్నారు. భారీగా తరలి వచ్చిన అభిమానుల మధ్య టాప్లేని జీపులో ఉదయం ఆయన జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకునేందుకు బయలుదేరారు. గుడి వద్దకు చేరుకోగానే కార్యకర్తలు, అభిమానులు గజమాలతో రేవంత్‌ను సత్కరించారు. అనంతరం పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద పండితులు ఆశీర్వచనం అందించారు. తర్వాత గాంధీభవన్‌కు రేవంత్ ర్యాలీగా బయల్దేరారు. గాంధీభవన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి రేవంత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో భారీ ర్యాలీ ఆకట్టుకుంది. రేవంత్ జిందాబాద్ నినాదాలు మిన్నంటాయి.