Take a fresh look at your lifestyle.

‘ఆపరేషన్ ఖజానా ..!’

  • గుప్త నిధుల కోసం తవ్వేవారే అర్ధరాత్రి పనులు చేస్తారు..
  • సెక్రెటేరియేట్ కూల్చివేతల పై ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు 
తెలంగాణ లో అనేక పనులు అనుమానస్పదంగా  జరుగుతున్నాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి  విమర్శించారు.దాదాపు రెండు వారాల పాటు సీఎం ఎవ్వరికీ కనిపించలేదని అన్నారు.మంగళవారం జూబ్లీహిల్స్ లోని మల్కాజ్గిరి పార్లిమెంట్ పార్టీ కార్యాలయం లో ఆయన మీడియా తో మాట్లాడుతూ..ప్రభుత్వం లో భాగస్వామ్యం ఉన్న కొంత మంది మిత్రులు నాకు కొంత సమాచారం ఇచ్చారని  అదే సమాచారం చెప్తున్నానని తెలిపారు.
జూన్ 29న  సచివాలయం కూల్చివేత కు హైకోర్టు అనుమతి ఇచ్చిందని అదే రోజు నుంచి సీఎం ఎవరికి కనిపించకుండా పోయాడని మళ్ళీ జులై 10న సచివాలయం కూల్చివేతను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించిందని ఆ తెళ్ళారే జులై 11న సీఎం ప్రత్యక్షమయ్యారని అన్నారు.ఈ మధ్య సమయం అంతా  సీఎం ఏం చేసారని ప్రశ్నించారు. సెక్రటేరియట్ కూల్చివేత లు ప్రారంబించి మరోవైపు కాంగ్రెస్ నేతల ఇళ్ళముందు భారీ గా పోలీసులను మొహరించారని ట్రాఫిక్ ను మళ్ళించి ,వేల మంది పోలీసుల పహారాలో సెక్రటేరియట్ ను కూల్చివేసారని కూల్చి వేత పనులు వీడియో తీసారని ఇద్దరు కానిస్టేబుల్ లలను డీజీపీ ఆఫీసు కు అటాచ్ చేసారని మండిపడ్డారు.ఇంత రహస్యంగా ఎందుకు  కూల్చాల్సిన అవసరం వచ్చిందని లోతుగా ఆలోచిస్తే ఆపరేషన్ ఖజానా బయటపడిందన్నారు.హొం సైన్స్ కాలేజీ కింద వనపర్తి మహారాజ్ సంస్థానం సంపద దాచిపెట్టిందని ఆర్కీయాలజి డిపార్ట్మెంట్ గతంలో నే చెప్పిందని గుర్తు చేశారు.జీ బ్లాక్ కు ఓ గొప్ప చరిత్ర ఉందని 12మంది ముఖ్యమంత్రులు ఈ బ్లాక్ నుంచే పరిపాలించారని దీని పక్కనే మింట్ కాంపౌండ్ లో నిజాం కాలంలో నాణేలు ముద్రించేవారని తెలిపారు.
నిజాం కాలంలో జీ బ్లాక్ కింద బంకర్ల లో నిధులు దాచిపెట్టారని చరిత్ర చెపుతుందన్నారు.హెచ్ఎండీఏ నోటిఫై చేసిన  హెరిటేజ్ బిల్డింగ్ లలో సైఫాబాద్ ప్యాలెస్(జీ బ్లాక్ ) కూడా ఉందని కానీ దాన్ని 183జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.
పాత సచివాలయంలో ఓక బ్లాక్ నుంచి మరో బ్లాక్ పోవాలంటె వర్షం వస్తే తడిస్తే ఫైల్స్ తడుస్తాయని కోర్ట్ కు ప్రభుత్వం చెప్పడం ఆస్యాస్పదంగా ఉందన్నారు.సెక్రటేరియట్ కూల్చివేసిన అన్ని రోజులు కేసీఆర్ ఎక్కడికిపోయాడో సమాధానం చెప్పాలన్నారు.గుప్త నిధుల కోసం తవ్వేవారు మాత్రమే అర్ద రాత్రి పనులు చేస్తారు.అణుబాంబు ప్రయోగం చేసేటప్పుడు కూడా ఇంత రహస్యం గా ప్రయోగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టు న్యాయమూర్తి  సుమోటోగా కేసు తీసుకొని విచారణ చేయాలని డిమాండ్ చేశారు.కూల్చివేతల కంటె ముందే గుప్త నిధుల పై విచారణ జరగాలన్నారు. హొం సైన్స్ కాలేజీ నుంచి మింట్ కాంపౌండ్ ,సైఫాబాద్ ప్యాలెస్ వరకు ఉన్న సొరంగం మొత్తం పూర్తి గా అన్వేషణ చేయాలని రేవంత్ రెడ్డి కోరారు..

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply