Take a fresh look at your lifestyle.

రైతులు చస్తుంటే రాజకీయ సభలా: మండిపడ్డ రేవంత్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌లపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విటర్‌ ‌వేదికగా విరుచుకుపడ్డారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే..అయ్య ఔరంగాబాద్‌లో.. కొడుకు ప్లీనరీల పేరుతో.. రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతు న్నారని రేవంత్‌ ‌విమర్శించారు.

వీళ్లకు మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. బాధ్యత ఉందా…ఇది ప్రభుత్వమేనా… ? అని నిలదీశారు. రైతు, యువత ఏకమై బీఆర్‌ఎస్‌ను బొందపెట్టే సమయం వస్తుందని రేవంత్‌ అన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌పెద్ద ఎత్తున సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనిని విమర్శిస్తూ రేవంత్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.

Leave a Reply