Take a fresh look at your lifestyle.

‘‌రేవంత్‌’ ఎం‌పిక.. అధిష్టానం సరైన నిర్ణయం

ఇంద్రవెల్లి సభ సక్సెస్‌ ‌చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆ స్థానానికి ఎంపిక చేయడంలో అధిష్టానం సరైన నిర్ణయమే తీసుకుందని ఆ పార్టీ వర్గాలు విశ్లేషించుకుం టున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతిన్న విషయం తెలియంది కాదు. ఈ ఏడేళ్ళ కాలంలో రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌తన ఉనికిని కాపాడుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. క్షీణ చంద్రుడిలా రోజురోజుకూ క్షీణించిపోతున్న ఆ పార్టీలో కొనసాగడానికే నాయకులు ఇబ్బంది పడుతున్న స్థితి. పార్టీ వల్ల లాభ పడినవారు, వివిధ పదవుల్లో కొనసాగిన పలువురు ఆ పార్టీని వీడిపోవడం, అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ‌విసిరిన ఆకర్ష్ ‌పథకంతో మరికొందరు కండువాలు మార్చుకోవడంతో భవిష్యత్‌లో రాష్ట్రంలో ఇక కాంగ్రెస్‌ అన్నది కనిపించదనే అభిప్రాయం వొచ్చింది. ఇలాంటి పరిస్థితిలో అధిష్టానం తెలుగుదేశం పార్టీ నుంచి వొచ్చిన రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలను అప్పగించింది. ఆ విషయంలో సీనియర్లు చాలామంది అలక వహించడం, కొందరైతే సహాయ నిరాకరణ చేయడం లాంటి అనేక చిక్కు ముడులను ఒక్కొక్కదాన్నే విప్పదీసుకుంటూ వొచ్చిన రేవంత్‌రెడ్డి, తన బలమేంటన్నది ఇంద్రవెల్లి సభ ద్వారా ఇటు పార్టీ శ్రేణులకు, అటు అధికార పార్టీకి తెలియజెప్పాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంతపెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసింది లేదు. ఈ సభకు సుమారు లక్షకు పైగానే జనం హాజరవుతారని కూడా ఎవరూ ఊహించి ఉండరు. అందునా ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో ఇంత భారీ సంఖ్యలో జనం పాల్గొనే అవకాశమే ఉండదని స్వీయ పార్టీవారే మొదట్లో తమ అనుమానాలను వ్యక్తపర్చారు కూడా. ఇంటలిజన్స్ ‌వర్గాలు లక్షలోపుగానే జనం వొచ్చినట్లు చెబుతు న్నప్పటికీ, వాస్తవంగా అంతకుమించి లక్షా యాభై వేలవరకు వొచ్చి ఉంటారని భావిస్తున్నారు.

ఎందుకంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో సభకు తరలి వొస్తున్న వారిని చాలా చోట్ల పోలీసులు నిలువరించడం, సభకు దాదాపు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో వొచ్చే వాహనాలు వారు నిలిపివేయడం వల్ల సభ సమాప్తమవుతున్న దశలో కూడా జనం తరలి రావడమో, మధ్యలో నుండే తిరిగి పోవడమో జరుగుతూ వొచ్చింది. దీన్ని బట్టి రేవంత్‌ ‌సభకు హాజరు కావాలన్న ఉత్సాహం చాలా మందిలో ఉందన్న వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు. వొచ్చిన వారు కూడా ముఖ్యంగా రేవంత్‌రెడ్డి ప్రసంగం కోసం వేచి చూడడం, సుమారు అరగంటకు పైగా ఆయన ఏకధాటిగా చేసిన ప్రసంగంలో ఎక్కడా ఆటంకం లేకుండా సభికులు నిశ్శబ్ధం పాటించడం, ఆయన వేసిన ఛలోక్తులకు జనం నుండి నినాదాలు రావడమే ఇందుకు సాక్షం. ఆ జన సమూహాన్ని చూసి రేవంత్‌ ‌తన ఆనందాన్ని వ్యక్తం చేసిన తీరు కూడా ప్రజలను ఆకట్టుకుంది. ఆదిలాబాద్‌ అడవుల్లో ప్రవహిస్తున్న గోదావరి, ఉప్పెన అయి ఇంద్రవెల్లిని కప్పేసిన ట్లుందనడంతో సభికుల్లో ఉత్సాహం ఇనుమ డించింది. ఇంతకాలం నిరాశ, నిస్రృహతో ఉన్న కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో కూడా నూతనోత్సాహం కనిపి ంచింది. ఈ సభను విజయవంతం చేయడంలో వారి పాత్ర కూడా గణనీయంగా ఉండింది.

సభకు వొచ్చిన వారికి మంచినీళ్ళు సరఫరాచేయడంతో పాటు మహిళలు, పురుషులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన స్థలాల విషయంలో వారు తీసుకున్న శ్రద్ద సభికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేసింది. ఇంత పెద్ద బహిరంగ సభ విజయవంతంగా ముగియడంతో నాయ కుల్లో కూడా కొంత కదలిక వొచ్చింది. నిన్నటి వరకు పార్టీ సారథిగా ఉన్న ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ‌పిసిసికి పోటీపడిన జగ్గారెడ్డి, హన్మంతరావు లాంటి కొందరు సీనియర్‌ ‌నాయకులు సభకు హాజరు కాకపోయినా మిగతా వారిని ఒకే వేదిక మీదకు తీసుకు రావడంలో రేవంత్‌రెడ్డి శ్రమ కనిపిస్తున్నది. సభ సక్సెస్‌ ‌కావడంతో గైర్హాజరు అయిన నాయకులిప్పుడు రేవంత్‌ ‌రెడ్డికి తమ సంపూర్ణ మద్దతుంటుందని ప్రకటనలు చేస్తున్నారంటే ఎవరెంత అడ్డు తగిలినా ఆయన ముందుకు దూసుకు పోతాడన్న నమ్మకం వారిలో కలిగి ఉంటుంది.

‘దళిత గిరిజన ఆత్మగౌరవ సభ’ పేరున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అధికార టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టడం ద్వారా కాంగ్రెస్‌ ‌పార్టీయే దళిత గిరిజనల్లో ఆత్మగౌరవాన్ని నింపుతుందన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశాడు. అధికారంలో ఉన్న ఏడేళ్ళ కాలంలో ఏనాడు దళితుల గురించి మాట్లాడని ముఖ్యమంత్రికి ఇప్పుడెందుకు ప్రేమ పుట్టుకొచ్చిందన్న విషయాన్ని విడమర్చి చెప్పే ప్రయత్నం చేశాడాయన. ఛాలెంజీగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపుకోసం అక్కడ మెజార్టీగా ఉన్న దళితులను దృష్టిలో పెట్టుకుని ‘దళిత బంధు’ను ప్రారంభించడం, ఇంద్రవెల్లి కాంగ్రెస్‌ ‌సభకు భయపడి ఇంత వరకు జ్ఞాపకం రాని పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూస్తానని ప్రకటించడాన్ని ఆయన ఎత్తి చూపుతూ, దళిత గిరిజనులు కెసిఆర్‌ ‌మాయా జాలంలో పడవద్దనిహెచ్చరించే ప్రయత్నం చేశాడు. మొత్తంమీద ఇంద్రవెల్లి సభ స్థబ్ధంగా ఉన్న కాంగ్రెస్‌కు నూతన జవసత్వాలు కలిగిం చిందనే చెప్పాలె. ఇక్కడ హాజరైన అశేష జనస మూహం వల్ల ఇంకా ప్రజల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ బలంగానే ఉందన్న సంకేతాలిచ్చినట్లైంది.

Manduva-Ravinder-Rao
– మండువ రవీందర్‌రావు

 

Leave a Reply