Take a fresh look at your lifestyle.

చిల్లర రాజకీయాలు మాని అభివృద్దిలో పోటీ పడాలి

  • రెండేళ్లలో బండి సంజయ్‌ ‌కరీంనగర్‌కు ఏం చేశారు
  • ఒక్క జాతీయ ప్రాజెక్టు లేదా రహదారిని తెచ్చారా ?
  • సాగర్‌లో ఆ పార్టీకి  డిపాజిట్‌ ‌కూడా దక్కదు
  • మున్సిపల్‌ ఎన్నిలకల్లోనూ టిఆర్‌ఎస్‌దే హవా
  • ఇల్లంతకుంటలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్‌ శ్రీ‌కారం

బిజెపి చిల్లర రాజకీయాలు తప్ప రాష్ట్రానికి, కరీంనగర్‌కు చేసిందేవి• లేదని మంత్రి కెటిఆర్‌ ‌మండిపడ్డారు. చిల్లరమాటు, చిల్లరకూతలు మానాలన్నారు. కెసిఆర్‌ను పదేపదే వమిర్శించడం తప్ప మరోటి లేదన్నారు. ఈ రెండేళ్లలో చేసిందేమిటో చెప్పాలన్నారు. దుబ్బాకలో 1100 వోట్లతో గెలిస్తే ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. బిజెపి అధ్యక్షుడు సంజయ్‌కు దమ్ముంటే తెలంగాణ అభివృద్ధికి ఏమైనా చేయాలన్నారు. కనీసం కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ అభివృద్ది కోసమైనా కృషి చేయాలన్నారు. అంతేగానీ అదేపనిగా విమర్శలు చేస్తుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సాగర్‌ ఉప ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్‌ ‌కూడా రాదన్నారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు రాదన్నారు. ఇల్లంతకుంటలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్బంగా కెటిఆర్‌ ‌మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మండిపడ్డారు. బండి సంజయ్‌ను సూటిగా అడుగుతున్నా.. ఈ రెండేళ్లలో కరీంనగర్‌ ‌పార్లమెంట్‌కు ప్రత్యేకంగా ఒక్క పైసా అయినా తెచ్చారా? మతం పేరుతో రెచ్చగొట్టడం, చిల్లర రాజకీయం చేయడం సరికాదు. దమ్ముంటే అభివృద్ధిలో తమతో పోటీ పడాలన్నారు. చేతనైతే కేంద్రం నుంచి రాష్ట్రాభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలి. దమ్ముంటే కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురా? అని సవాల్‌ ‌చేశారు.

చేతనైతే మరిన్ని జాతీయ రహదారులు, నవోదయ పాఠశాలలు తీసుకురా? అంతేకానీ తెల్లారితే చిల్లర మాటలు, చిల్లర కూతలు కూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఎన్నికలు వొచ్చినప్పుడు మాట్లాడితే కొత్త బిచ్చగాడు అని వదిలిపెడుతున్నాము. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని మాట్లాడాలి. దుబ్బాకలో గెలిచినోళ్లు.. ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందలేకపోయారు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభంజనం సృష్టించబోతున్నది. అక్కడ బీజేపీ డిపాజిట్‌ ‌గల్లంతు కావడం ఖాయమన్నారు. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ ‌భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. అభివృద్ధిలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కేటీఆర్‌ ‌సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయం పండుగగా మారిందని మంత్రి అన్నారు. ప్రాజెక్టులతో మత్తడులలో నీళ్లు దుంకుతున్నాయని అన్నారు. యాసంగి పంటలో రాష్ట్రం దేశంలోనే నంబర్‌ ‌వన్‌గా నిలుస్తుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వీలైనన్ని ఎక్కువ ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొనుగోలు చేశామన్నారు. ఇప్పుడు కూడా అదే రీతిలో 6700 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న బాధపడొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 5 వేల ఎకరాలకు చొప్పున ఒక రైతు వేదికను ఏర్పాటు చేశాం. ఏఈవోలను నియమించుకున్నామని అన్నారు.   ఇల్లంతకుంట మండల కేంద్రంలో 30 పడకల హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సిద్దిపేట నుంచి ఇల్లంతకుంటకు నాలుగు లేన్ల రహదారితో పాటు ఇతర రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి విషయంలో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సీఎం కేసీఆర్‌ ‌నిధులు మంజూరు చేస్తున్నారు. కొత్త పెన్షన్లు, రేషన్‌కార్డులు కూడా త్వరలో అందజేస్తామన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, వివేకానంద విగ్రహం దగ్గర సెంట్రల్‌ ‌లైటింగ్‌ ‌సిస్టం, బస్టాండ్‌ ‌వద్ద మహిళా సంఘ భవనం, తాసిల్‌ ‌నూతన కార్యాలయ భవనం, రైతువేదిక, కూరగాయల అంగడిని మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ‌ప్రసంగిస్తూ ఒక్కరోజే ఇన్ని కార్యక్రమాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్‌ ‌సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేశాం. నేడు ఎండకాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నాయి. నీటి సంరక్షణ విషయంలో దేశానికే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 వి•టర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రాజరాజేశ్వర సాగర్‌, అనంతగిరి రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నానని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు ఉండే చిక్కులు, ఇబ్బందులు సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు. భూ నిర్వాసితులకు మంచి పరిహారం ఇస్తున్నామని తెలిపారు. వీరి త్యాగాన్ని చరిత్రలో ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని వాగులు, వంకలు, చెరువులను నింపుకుంటున్నాం. రైతు ఆత్మహత్యలు లేని రాజ్యం కావాలని సీఎం కేసీఆర్‌ ‌కలలు కన్నారు. రైతుబంధు రూపంలో ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నాం. రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంలో రూ. 5 లక్షల బీమా అందిస్తున్నాం. రైతుల రుణాలు మాఫీ చేసుకున్నాం. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ రుణమాఫీ కోసం బ్జడెట్‌లో రూ. 5,250 కోట్లు కేటాయించుకున్నాం. సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా ముందుకెళ్తున్నాయి. చెరువు వి•ద ఆధారపడే ప్రతి కులవృత్తి విరాజిల్లుతుందన్నారు. చేపలు పట్టే గంగపుత్రులు, మత్స్యకారులు సంతోషపడుతున్నారు. మత్స్య సంపదతో వారి ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయన్నారు.

Leave a Reply