- కెసిఆర్ కుటుంబీకులకు దొడ్డిదారిన పదవులు
- ఫీజు రియంబర్స్మెంట్పై ఆంక్షలు
- గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బిజెపి నేతలు
తెలంగాణలో అన్ని విశ్వ విద్యాలయాలు సిబ్బంది లేక కుప్పకూలుతు న్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం గవర్నర్ తమిళిసైతో భేటీ అనంతరం వి•డియాతో మాట్లాడుతూ…కేసీఆర్ కుటుంబీకులు మాత్రం దొడ్డి దారిన పదవులు పొందుతున్నారని విమర్శించారు. ఓబీసీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అనేక ఆంక్షలు పెడుతుండటాన్ని బీజేపీ తప్పు పడుతుందని తెలిపారు. విశ్వ విద్యాలయాలలో కాంట్రాక్ట్ వ్యవస్థపై, ఇంకా విశ్వ విద్యాలయాల సమస్యపై గవర్నర్‌కు వివరించడం జరిగిందని…గవర్నర్ సానుకూలంగా స్పందించారని లక్ష్మణ్ అన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు దహనం అయిన ఉద్యమ సైనికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న విశ్వ విద్యాలయాలలో వీసీలు లేరని… ఉన్నత విద్యా రంగానికి ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. బీజేపీ ఒత్తిడి వల్ల రెండు విశ్వ విద్యాలయాలకు వీసీలను నియమించారన్నారన్నారు. యూనివర్సిటీలలో చాలా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. కొత్త ప్రైవేట్ విశ్వ విద్యాలయాలు టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే అనుమతి ఇచ్చారని మురళీధర్‌రావు మండిపడ్డారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.