Take a fresh look at your lifestyle.

కోడిపందాలు నిర్వహించే ప్రాంతాల్లో ఆంక్షలు

  • పత్యేక బృందాలతో పోలీసుల గస్తీ
  • బరులు నిర్వహించే ప్రాంతాల్లో పరిశీలన

ఏలూరు, జనవరి 13 : పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందేలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. జిల్లాలోని భీమవరం, వెంప, ఐ. భీమవరం, కలగంపూడి, శ్రీనివాస పురం, కొప్పాక ప్రాంతాల్లో కోడిపం దాలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయితే… ఈ ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్‌ ‌విధించడంతో పందేల పరిస్థితి ఏమిటన్నది అర్ధంగాకుండాఉంది. అంతేగాకుండా కోడిపందాలను అడ్డుకునేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు 60 బృందాలను ఏర్పాటు చేశారు. ఇక కోడి పందేలు నిర్వహించే బరుల దగ్గర లిక్కర్‌ అమ్మకాల నిరోధానికి ఎక్సైజ్‌ అధికారులు బృందాలను ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ కోడిపందేలను జరగనివ్వబోమని.. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ అన్నారు. కోడిపందేలకు అనుమతు లివ్వాలంటూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌వేసిన నేపథ్యంలో గతేడాది సంక్రాంతి సమయంలో ఇచ్చిన తీర్పే ఈసారీ వర్తిస్తుందని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌బెంచ్‌ ‌వెల్లడించింది. ప్రాంగణాల్లోకి వెళ్లి కోళ్లను పట్టుకోకూడదని, రైతులను అరెస్టు చేయకూడదని తెలిపింది.

సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తా మన్నారు. కోళ్లను పెంచుతున్న వారిని, రైతులను అరెస్టు చేయబోమని పేర్కొన్నారు. కానీ కోడిపందేలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. ఈ సంక్రాంతికి జిల్లాలో కోడిపందేలు జరగకుండా అడ్డుకునేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. హైకోర్టు ఉత్తర్వులను పాటిస్తామని పేర్కొన్నారు. కోడి పందేలను అడ్డుకొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని చెప్పారు. వీరు ఆయా ప్రాంతాల్లో వీడియో కెమెరాలతో సహా నిఘా వేసి పందేల కోసం జరిగే ఏర్పాట్లను నిలువరి స్తారని పేర్కొన్నారు. దీనిపై పోలీసు అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. కోడిపందేలు నిర్వహించే వారిపై బైండోవర్‌ ‌కేసులు నమోదు చేశామని తెలిపారు. అలాగే కోడిపందేలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు.

Leave a Reply