Take a fresh look at your lifestyle.

స్పందన ఆర్జీలు బాక్సులో వేయాలి

సబ్‌కలెక్టర్‌ ‌వెల్లడి

విజయవాడ, ఏప్రిల్‌ 26 : ‌కోవిడ్‌ ‌వ్యాప్తి దృష్ట్యా స్పందన ధరఖాస్తులకు కార్యాలయంలో ప్రత్యేక  అర్జీల బాక్స్ ఏర్పాటు చేసినట్లు  సబ్‌ ‌కలెక్టరు ప్రతిష్టమన్‌ ‌గైన్‌ ‌వెల్లడించారు.  కోవిడ్‌ ‌విస్త్రృతంగా వ్యాపిస్తున్న దృష్ట్యా స్పందన ధరఖాస్తులను సబ్‌ ‌కలెక్టరు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అర్జీల బాక్స్ ‌నందు ధరఖాస్తులను వేయాలని, సదరు అర్జీల డ్రాప్‌ ‌బాక్స్ ‌లో వేసిన ధరఖాస్తులను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సబ్‌ ‌కలెక్టరు ప్రతిష్ట మన్‌ ‌గైన్‌ ‌తెలియజేశారు.  స్పందన ద్వారా కార్యాలయంనకు అందిన ధరఖాస్తులను సోమవారం సబ్‌ ‌కలెక్టరు పరిశీలించారు.  ఈ సందర్బంగా సబ్‌ ‌కలెక్టరు ప్రతిష్టమన్‌ ‌గైన్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందన ద్వారా అందిన పేద ప్రజల అర్జీల పరిష్కారంనకు అత్యంత ప్రధాన్యతా అంశంగా పరిగణిస్తుందన్నారు.  స్పందనపై అంధిన ధరఖాస్తులను సంబంధిత అధికారులకు వెంటనే పంపి , వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవల్సిం దిగా ఆదేశించడం జరుగుతుందన్నారు.  అర్హత కలిగిన అర్జీలన గడువు తేదీలోగా పరిష్కరించి సంబంధిత సమాచారంను అర్జీదారునికి తెలియ జేయవల్సి ఉంటుందని, అర్హతలేని ధరఖాస్తులను అందుకుగల కారణాలను తెలియజేస్తూ వెంటనే త్రిప్పి పంపాలని అధికారులను ఆదేశించడం జరుగు తుందన్నారు.  స్పందన కార్యక్రమం క్రింద ధరఖాస్తులు అందించేందుకు కార్యాలయంనకు వచ్చే ధరఖాస్తు దారులు తప్పనిసరిగా మాస్క్ ‌ధరించి శానిటైజరు వినియోగించాలన్నారు.  ధరఖాస్తుదారులు ఎక్కువగా ఉన్న సమయంలో సామాజిక దూరాన్ని తప్పకపాటిం చాలన్నారు.  కార్యక్రమంలో డివిజనల్‌ ‌పరిపాలనాధి కారి యం.హరనాథ్‌, ‌సబ్‌ ‌కలెక్టరు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply