Take a fresh look at your lifestyle.

విస్తృత సంప్రదింపులతో కేసులకు పరిష్కారం

కోర్టుకు రావడమన్నది చివరి ప్రయత్నం కావాలి
భారతంలోనూ సంప్రదింపుల పక్రియ ఉంది
తెలుగు మాట్లాడకుండా ఉంటే లోటుగా ఉంటుంది
ఆర్బిట్రేషన్‌, ‌వి•డియేషన్‌ ‌సెంటర్‌ ‌సన్నాహక సదస్సులో సుప్రీమ్‌ ‌కోర్టు సిజె ఎన్వీ రమణ
హైదరాబాద్‌లో సెంటర్‌ ఏర్పాటును స్వాగతించిన సిఎం కెసిఆర్‌
కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని చెప్పారు. విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్‌ ‌హెచ్‌ఐసీసీలో జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, ‌వి•డియేషన్‌ ‌సెంటర్‌ ‌సన్నాహక సదస్సుకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కోర్టులకు వొచ్చేముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో పరిష్కారాలు లభిస్తాయని చెప్పారు. పెండింగ్‌ ‌కేసుల సత్వర విచారణ జరగాలన్నారు. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉన్నదని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు పాండవులు, కౌరవులకు మధ్య మధ్యవర్తిత్వం నెరపిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చని వెల్లడించారు. ఆస్తుల పంపకాలను కుటుంబ సభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సాధ్యమైనంతవరకు మహిళలు మధ్యవర్తిత్వంలో వివాదాలు పరిష్కరించుకోవాలన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ‌సెంటర్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌ ‌సరైన వేదిక అని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. ఆ మేరకు చట్టాల్లో కూడా మార్పులు వొచ్చాయన్నారు. ‘ఎవరికైనా వ్యక్తి గత జీవితంలో సమస్యలు వొస్తే వారిని మనం దూరంగా పెడుతాం. ప్రతిరోజూ సమస్యలు వొస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా మనిషి ఉండడు. బిజినెస్‌లో సమస్యలు వొస్తే కోర్టులకు వొస్తారు. 40 సంవత్సారాల అనుభవంతో చెప్తున్నా..ఆర్బిట్రేషన్‌ ‌చివరి దశలో జరగాలి. అంతర్జాతీయ పారిస్‌, ‌సింగపూర్‌, ‌లండన్‌, ‌హాంగ్‌కాగ్‌లలో ఆర్బిట్రేషన్‌ ‌సెంటర్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడం చాలా సంతోషం. సింగపూర్‌, ‌సీజేతో కూడా మాట్లాడాను. వారి సహకారం అందిస్తామని హావి• ఇచ్చారు. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు, ఐటి కంపెనీల సహకారం కూడా ఎంతో అవసరం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ‌నెంబర్‌ ‌వన్‌గా ఉంది. తెలంగాణ ప్రజలు దేన్నైనా స్వాగతిస్తారు.

ప్రతి మనిషి జీవితంతో లీగల్‌ ‌సిస్టం ముడిపడి ఉంటుంది. జూన్‌లో సీఎం కేసీఆర్‌తో సెంటర్‌ ‌గురించి చర్చించినప్పుడు మంచి సహకారం అందించారు. డిసెంబర్‌ 18‌న ఆర్బిట్రేషన్‌ ‌సెంటర్‌ ‌నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. ఆర్బిట్రేషన్‌ ‌సెంటర్‌ను నెలకొల్పడంలో జస్టిస్‌ ‌హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేను’ అని ఈ సందర్భంగా సిజె రమణ పేర్కన్నారు. చివరలో ఆయన తెలుగులో మాట్లాడుతూ కెసిఆర్‌ ‌కృషిని అభినందించారు. తెలుగులో మాట్లాడకపోతే పెరుగన్నం తిననంత లోటు ఉంటుందన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు మాట్లాడుతూ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ అం‌డ్‌ ‌వి•డియేషన్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, పలువురు న్యాయమూర్తులు హాజరైన ఈ సదస్సులో సీఎం మాట్లాడుతూ..నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు ఆయన తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్బిట్రేషన్‌ ‌కేంద్రానికి హైదరాబాద్‌ అన్నివిధాలా అనువైన ప్రాంతమని సీఎం కేసీఆర్‌ ‌చెప్పారు. అతితక్కువ కాలంలోనే హైదరాబాద్‌ ‌నగరంలో ఎమర్జింగ్‌ ‌సిటీగా ఎదిగిందని అన్నారు. హైదరాబాద్‌ అన్ని రకాల సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడులకు అనువైనదన్నారు. ఇక, మధ్యవర్తిత్వం అనేది దేశంలో రచ్చబండ లాంటి వేదికల రూపాల్లో ఎప్పటి నుంచో ఉన్నదని చెప్పారు. గ్రామాల్లో పెద్దలు పంచాయతీలు ఏర్పాటు చేసి వివాదాలు పరిష్కరించేవారని అన్నారు. దేశంలో వివిధ కారణాలతో పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. అయితే, దేశంలో కోర్టులు, సిబ్బంది కొరత కారణంగా ఇలాంటి వివాదాల ఏండ్ల కొద్ది పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉంటున్నాయని చెప్పారు. ఈ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అం‌డ్‌ ‌వి•డియేషన్‌ ‌సెంటర్ల ఏర్పాటు ద్వారా పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు సంబంధించిన వివాదాలు తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. ఆర్బేట్రేషన్‌ ‌సెంటర్‌ ఏర్పాటు కోసం ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే 25 వేల చదరపు అడుగుల స్థలం కేటాయిస్తున్నామని, శాశ్వత భవనం కోసం త్వరలో పుప్పాలగూడలో భూమి కేటాయిస్తామని సీఎం తెలిపారు.

Leave a Reply