- లేదంటే కిషన్ రెడ్డి రాజీనామా చేస్తారా
- కిషన్ రెడ్డి సిగ్గులేని నేత..: మంత్రి కెటిఆర్
సూర్యాపేట,ప్రజాతంత్ర,జనవరి6: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపిలకు సిగ్గుశరం, లజ్జలేదని మంత్రికెటిఆర్ మండిపడ్డారు. నిధులు దారిమళ్లించారని కిషన్ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిధులు తెలంగాణవి తీసుకుని బిజెపి పాలిత రాష్టాల్ల్రో ఖర్చుచేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ కట్టిన డబ్బులు తీసుకెళ్లి.. ఇతర రాష్టాల్ర అభివృద్దికి వాడుతున్నారని మండిపడ్డారు. తాను చెప్పింది తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అని అన్నారు. లేకపోతే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి లాంటి సన్నాసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు.
ఆయన మాట్లాడేవన్ని అబద్దాలు.. నిలదీస్తే ఒక్క సమాధానం కూడా చెప్పడని మండిపడ్డారు. హుజుర్నగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ వల్ల కార్పొరేట్ శక్తులు బాగుపడ్డాయి. ప్రజలు మాత్రం మరింత అగాధంలోకి వెళ్లారు. మోదీ వల్ల దేశం అప్పులపాలైంది.. దేశం అభాసుపాలైందన్నారు. దేశానికి వేగు చుక్క మన తెలంగాణ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాల మాట పక్కన పెడితే.. ఉన్న వాటిని ఊడగొడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. మంచి ఎవరు చేస్తున్నారన్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ప్రజలకు మరింత మంచి చేయడానికే పార్టీ పేరు మార్చామే తప్ప అభివృద్ధి, సంక్షేమం విషయంలో తేడా ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు. ’భారతీయ జనతా పార్టీ ప్రమాదకరమైన పార్టీ, మతాల మధ్య పంచాయతీ పెట్టడం బీజేపీ పని. దాని ఉచ్చులో యువత పడొద్దని అని కేటీఆర్ అన్నారు.
హుజుర్నగర్లో ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి బహిరంగ సభలో కేటీఆర్ పాల్గని ప్రసంగించారు. భారతదేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రూ. 30 వేల కోట్లతో దామరచర్లలో అల్టా మెగా వపర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది.. దేశాన్ని బాగు చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు రాకపోతే నోరు కూడా మెదపని సన్నాసులు బిజెపి నాయకులు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్భం గడుపుకోవాలని కుట్రలు చేస్తున్నది బీజేపీ అని మండిపడ్డారు. బిజెపి వల్ల ఒక దళితుడిగాని, ఒక గిరిజన వ్యక్తిగాని బాగుపడ్డ దాఖలాలు లేవు అని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్లలె ప్రగతి ద్వారా అద్భుతంగా పల్లెలు బాగు పడ్డాయి.
భారతదేశంలోనే తెలంగాణా గ్రామ పంచాయతీలు గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాయని తెలిపారు. ఉప ఎన్నికల తర్వాత హుజుర్నగర్ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. ఎవరి వల్ల రాష్ట్రం ముందుకు పోతుందో ప్రజలే గమనించాలని సూచించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది.. దేశాన్ని బాగు చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం అని కేటీఆర్ తేల్చిచెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు రాకపోతే నోరు కూడా మెదపని సన్నాసులు బీజేపీ నాయకులు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్భం గడుపుకోవాలని కుట్రలు చేస్తున్నది బీజేపీ అని మండిపడ్డారు. బీజేపీ వల్ల ఒక దళితుడిగాని, ఒక గిరిజన వ్యక్తిగాని బాగుపడ్డ దాఖలాలు లేవు అని స్పష్టం చేశారు.
హుజూర్ నగర్లో పలు అభివృద్ధ్ది పనులు
ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హుజూర్నగర్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హుజూర్నగర్ చేరుకున్న కేటీఆర్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి స్వాగతం పలికారు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ దవాఖానను, ఎస్టీవో కార్యాలయం, బస్తీ దవాఖాన, ఎమ్మెల్యే క్యాపు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేతవారి గూడెం నుంచి మునగాలకు నిర్మించే రోడ్డును, నేరేడుచర్ల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
హుజూర్నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.అటునుంచి మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ జిల్లాలోని చండూరుకు చేరుకుంటారు. మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం గట్టుప్పల్ మండల కేంద్రంలో నిర్మించనున్న చేనేత క్లస్టర్లకు భూమిపూజ చేస్తారు.