బస్తీ ప్రజల నాయకుడు :మానవ హక్కుల వేదిక నివాళులు
హైదరాబాద్,మే 28:నివాస హక్కుల ఉద్యమ నేత, ఛత్రి(CHATRI-Campaign for Housing and Tenurial Rights ) సంస్థ నాయకుడు, మొహమ్మద్ అశ్వాక్ , శుక్రవారం ఉదయం గుండె పోటుతో మరణించారు . గత 30 సంవత్సరాలుగా పట్టణ పేదల నివాస హక్కుల కోసం తెలుగు రాష్ట్రాలలో పని చేసారు.ఒక బస్తీ నాయకుడిగా, బస్తి లో ఇళ్లు కాపాడుకునే ప్రయత్నం ఆయనను నివాస హక్కుల ఉద్యమ నాయకుడిగా మలిచింది. నగరంలో ఎన్నో బస్తీలను బలవంతపు తొలిగింపుల నుంచి కాపాడి, ఎన్నో పేద కుటుంబాలకు ఇళ్లు అందేలా చేసిన నేత.. ఆయన మరణం నివాస హక్కుల ఉద్యమానికి తీరని దెబ్బ..
అని మానవ హక్కుల వేదిక తరఫున ఎస్ .జీవన్ కుమార్ ,వేమన వసంత లక్ష్మి,సయ్యద్ బిలాల్ తీవ్ర సంతాపాన్ని తెలిపారు.. తెలుగుదేశం హయంలో నందన వనం ప్రాజెక్ట్ పేరుతో మూసీ నది వెంబడి ఉన్న బస్తీలను తొలగించే ప్రయత్నం జరిగినప్పుడు ,అప్పటి పౌర హక్కుల నాయకులు బాలగోపాల్,కన్నాభిరాన్ ,జీవన్ కుమార్,వివిధ పౌర,ప్రజాస్వామిక సంస్థల భాగస్వామ్యంతో , ,బ్రదర్ వర్గీస్, ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ సంస్థ బాధ్యుడు వేదకుమార్ తో కలిసి మూసి బచావో ఆందోళన పేరుతో బస్తీ ప్రజల ఉద్యమాన్ని మహమ్మద్ అశ్వాక్ నిర్మించాడు అని గుర్తుచేసుకున్నారు. .మానవ హక్కుల నగర కమిటీ లో చురుకయిన కార్యకర్త మహమ్మద్ అశ్వాక్ మేధా పాట్కర్ ను ఆ ఆందోళనలో భాగం చేసి ఆమెకు సన్నిహితుడై దేశ వ్యాప్తం గా నివాస హక్కుల ఉద్యమాల్లో పాల్గొన్నారు.