Take a fresh look at your lifestyle.

నగరంలో జంటజలాశయాలకు జలకళ…

  • ఆసక్తిగా చూడటానికి తరలివస్తున్న జనం
  • జూరాలకు కొనసాగుతున్న వరద

హైదరాబాద్‌ ‌నగరంలో జంట జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వొస్తున్న వరద నీటితో హిమాయత్‌ ‌సాగర్‌ ‌నిండుకుండలా మారింది. గండిపేట, హిమాయత్‌ ‌సాగర్‌ ‌జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. చాలాకాలం తరవాత నీరు చేరడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్త చేస్తూ ఆసక్తగా వొచ్చి చూస్తున్నారు. నేడో, రేపో గేట్లు అధికారులు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్‌ ‌నగర వాసుల నీటి కష్టాలు తీరనున్నాయి. ఉస్మాన్‌ ‌సాగర్‌ ‌జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా… ప్రస్తుతం 1784.24 అడుగులకు చేరింది. ఉస్మాన్‌ ‌సాగర్‌ ‌జలాశయంలోకి 833 క్యూసెక్కుల ఇన్‌ప్లో వొచ్చి చేరుతుంది. అటు హిమాయత్‌ ‌సాగర్‌ ‌జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా…ప్రస్తుత 1762.20 అడుగులుగా కొనసాగుతుంది. హిమాయత్‌ ‌సాగర్‌లోకి 277 క్యూసెక్కుల నీరు వొచ్చి చేరుతుంది.

జూరాలకు కొనసాగుతున్న వరద
మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వొచ్చి చేరుతున్నది. దీంతో ప్రస్తుతం జలాశయంలోకి 63,100 క్యూసెక్కుల నీరు వొస్తుండగా, 36,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.473 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 వి•టర్లు. ప్రస్తుతం 316.750 వి•టర్లకు చేరుకుంది. దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 37,150 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులుకాగా, ప్రస్తుతం 810.50 అడుగులు ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు. అయితే ప్రస్తుతం 34.6077 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

Leave a Reply