Take a fresh look at your lifestyle.

రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌మరో కీలక నిర్ణయం

  • ఇఎమ్‌ఐలపై మరో మూడు నెలల మారటోరియం
  • రెపోరేటు 4.4 శాతం నుంచి 4 శాతానికి తగ్గింపు
  • రివర్స్ ‌రెపోరేటు 3.35శాతానికి కుదింపు
  • డబ్బు అందుబాటులో ఉండేందుకు ఈ చర్య
  • డియా సమావేశంలో వెల్లడించిన గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌

లాక్‌డౌన్‌ ‌కొనసాగుతున్న వేళ రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈఎంఐలపై ఇచ్చిన మూడు నెలల మారటోరియాన్ని ఇప్పుడు మరో మూడు నెలల వరకు మళ్లీ పొడిగించింది. మారటోరియాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నామన్ని, జూన్‌ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ మారటోరియం వర్తిస్తుందని ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌తెలిపారు. ముంబైలో ఆయన డియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. భవిష్యత్తును ఎదుర్కొనేందుకు ఆర్బీఐ జాగ్రత్తగా ఉందని, ఎటువంటి సవాల్‌ అయినా స్వీకరిస్తామని గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌తెలిపారు. టర్మ్ ‌లోన్లకు అదనంగా 90 రోజుల ఎక్స్‌టెన్షన్‌ ఇస్తున్నామన్నారు. టర్మ్ ‌లోన్లపై మూడు నెలల మారిటోరియాన్ని పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌తెలిపారు.లాక్‌డౌన్‌ ‌పొడగింపు వల్ల ఈ నిర్ణయం తప్పడంలేదన్నారు. కరోనా వైరస్‌ ‌వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదన్నారు.

రెపో రేటును 40 బేసిస్‌ ‌పాయింట్లు తగ్గించామని, దీంతో రెపో రేటు 4.4 శాతం నుంచి 4 శాతానికి చేరుకున్నట్లు చెప్పారు. దీని వల్ల ఈఎంఐలో తీసుకున్న రుణాలపై భారం తగ్గనున్నది. కోవిడ్‌19 ‌సంక్షోభం నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఊహాచిత్రాన్ని ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. రివర్స్ ‌రెపో రేటును 3.35 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. భారత్‌ ఆర్థికంగా మళ్లీ గాడిలో పడుతుందన్న విశ్వాసం కలిగి ఉండాలని శక్తికాంత్‌ ‌దాస్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది వాణిజ్యం సుమారు 13 నుంచి 32 శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌తెలిపారు. ప్రైవేటు సంస్థల వినియోగం దారుణంగా పడిపోయినట్లు ఆయన చెప్పారు. కీలకమైన పరిశ్రమల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఒక్క వ్యవసాయంపైనే ఆశలు పెట్టుకున్నట్లు శక్తికాంత్‌ ‌తెలిపారు. రుతుపవనాలపై కేంద్ర వాతావరణశాఖ ఇస్తున్న సమాచారం వ్యవసాయం రంగంపై మరింత ఆశలను రేపుతున్నట్లు ఆయన చెప్పారు. ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 8.6 శాతానికి చేరినట్లు చెప్పారు. దేశంలో పరిశ్రమల ఉత్పత్తి మార్చి నెలలో 17 శాతం పడిపోయిందన్నారు. కీలక పరిశ్రమల ఔట్‌పుట్‌ 6.5 ‌శాతానికి తగ్గినట్లు తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధిత రంగాలు మాత్రమే ఆశాజనకంగా ఉన్నాయని, ఆహార ఉత్పత్తులు 3.7 శాతం పెరిగినట్లు చెప్పారు.

భారత విదేశీ మారక విలువలు 2020-21 సంవత్సరానికి 9.2 బిలియన్లు పెరిగినట్లు తెలిపారు. 2020-21 సంవత్సరానికి జీడీపీ వృద్ధి నెగటివ్‌ ‌క్యాటగిరీలోనే ఉంటుందన్నారు. రెండవ అర్థభాగంలో పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. రెపో రేటు 40 బేసిస్‌ ‌పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌ప్రకటించారు. శుక్రవారం ప్రెస్‌‌ట్‌ ‌నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు. రివర్స్ ‌రెపోరేటు 3.35శాతానికి కుదిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని, ఆర్థికరంగ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ ‌నెలల్లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌ ‌కాలంలో సిమెంట్‌ ఉత్పత్తి 25శాతం తగ్గిందని, పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడిందని శక్తికాంత్‌దాస్‌ ‌వెల్లడించారు.మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 15శాతం పడిపోయిందని, ఏప్రిల్‌లో తయారీరంగంలో ఎన్నడూ లేనంత క్షీణత కనిపించిందని పేర్కొన్నారు. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందని దాస్‌ ‌ప్రకటించారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగిందని, వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం అంచనా వేయడం క్లిష్టంగా మారిందని శక్తికాంత్‌దాస్‌ ‌చెప్పారు.ఆర్థిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు దెబ్బతిన్నాయని, మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేందుకు రెపో రేటు తగ్గించామని ఆయన స్పష్టం చేశారు. రుణాలపై మారటోరియం మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. జూన్‌ 1 ‌నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌తెలిపారు.

Leave a Reply