Take a fresh look at your lifestyle.

కూలీల సమస్యలు పరిష్కరించాలని వినతి

సూర్యాపేట, మే 20, ప్రజాతంత్ర ప్రతినిధి:ఉపాధి హామీ పనులు నిర్వర్తిస్తున్న కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగిందని భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్‌ ‌సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఉపాధి ద్వారా ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు 1,2వారాలు మాత్రమే పనులు కల్పించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. గత మూడు వారాలుగా పనిచేసిన కూలీలకు నేటి వరకు వేతనాలు రాలేదని గుర్తుచేశారు. వేతనాలు రాక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే కూలీలకు అందజేయాలని కోరారు. అనేక మందికి జాబ్‌ ‌కార్డు లేనందున పనులు కల్పించడం లేదని వాపోయారు. దరఖాస్తుల పెట్టుకొని 20రోజుల అవుతున్నా నేటివరకు కార్డులను అందజేయలేదని స్పష్టం చేశారు.

వికలాంగుల గ్రూప్‌లకు ప్రతి రోజు పనులు కల్పించాలని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 200రోజులు కూలీకి కల్పించి రోజువారి వేతనంగా 600 రూపాయలు ఇవ్వాలన్నారు. ప్రతి కుటుంబానికి 7,500రూపాయాలను అందించి, కూలీలకు శానిటైజర్లు, మాస్క్‌లను పంపిణీ చేయాలని సూచించాఆరు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక కార్యదర్శులు పద్మావతి, మట్టిపెళ్లి సైదులు, సత్యం, అంజయ్య, సురభి, రమేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy