72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మసాబ్ టాంక్ లోగలసమాచార పౌర సంబంధాల కమిషనరేట్ కార్యలయ ఆవరణలో ఘనంగా జరిగాయి. సమాచార,పౌర సంబంధాల కమిషనర్ అర్వింద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సిబ్బంది కి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, FDC ఎక్సూక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, cie రాధా కిషన్, జాయింట్ డైరెక్టర్లు జగన్, వెంకటేశ్వరరావు, మీడియా అకాడమీ సెక్రటరీ అలీ ముర్తుజా, డిప్యూటి డైరక్టర్లు హాష్మీ,రాజారెడ్డి, సురేష్,అసిస్టెంట్ డైరెక్టర్ యామిని, సమాచార శాఖ సిబ్బంది పాల్గొన్నారు.