హైదరాబాద్,ప్రజాతంత్ర ,జనవరి 25: ఈ యేడుకూడా గణతంత్రవేడుకలను రాజ్‌భవన్‌లోనే నిర్వహిస్తారు. గవర్నర్ తమిళసై జెండా ఆవిష్కరిస్తారు. సిఎస్ శాంతికుమార్, డిజిపి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ప్రభుత్వం లేఖ ద్వారా రాజ్‌భవన్‌కు తెలియచేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతేడాది లాగే ఈసారి కూడా పరేడ్ గ్రౌండ్లో కాకుండా రాజ్ భవన్ లో నిర్వహించాలంటూ ప్రభుత్వం లేఖ పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పేరుతో రిపబ్లిక్ డే వేడుకలు జరపకపోవడంపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 21న రాజ్ భవన్‌కు లేఖ పంపిన ప్రభుత్వం ఈసారి కూడా రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిం చిందని, గవర్నర్ తమిళిసై జాతీయ జెండా ఎగరవేస్తారని అందులో పేర్కొంది.
చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని లేఖలో స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఈసారి కూడా గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆమె సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడ రిపబ్లిక్ డే వేడుకల్లో తమిళిసై పాల్గొంటారు. ఇదిలా ఉంటే తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. రాష్టాల్రు గణతంత్ర వేడుకలు నిర్వహించి విద్యార్థులను అందులో భాగస్వాములను చేయాలని కేంద్రం సర్క్యులర్ పంపినా కేసీఆర్ సర్కారు దాన్ని బేఖాతరు చేస్తోందని పిటిషన్ లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్రం ధిక్కరించడంపై దాఖలైన ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై జస్టిస్ మాధవి ధర్మాసనం విచారణ జరపనుంది.
- గణతంత్ర వేడుకలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- పరేడ్‌తో కూడిన వేడుకులు నిర్వహించాలని ఆదేశాలు
- కేంద్రప్రభుత్వం గైడ్‌లైన్స్ పాటించాలని సూచన
కూడిన వేడుకలు నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించకపోవడంపై దాఖలైన పిటిషన్ పై విచాణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్.. కొవిడ్ కారణంగా పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించడం లేదని చెప్పారు. రాజ్ భవన్లో ఇప్పటికే గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ పిటిషన్ రాజకీయ దురుద్ధేశంతో వేశారని ఏజీ కోర్టుకు విన్నవించారు. అయితే కోవిడ్ ప్రోటోకాల్ జీవో కోర్టుకు ఎందుకు సమర్పించలేదని కోర్టు ఏజీని ప్రశ్నించింది. 1950 నుంచి దేశంలో గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయని.. పెరేడ్ తప్పకుండా నిర్వహించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పెరేడ్ ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయించుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు అధికారికంగా నిర్వహించాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై బుధవారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్ కే ఎందుకు పరిమితం చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటిస్తారా? లేదా? చెప్పాలంది. పిటిషనర్ తరఫున న్యాయవాది, మరోవైపు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటించాలని పేర్కొంది. అలాగే గణతంత్ర వేడుకలకు కోవిడ్ కారణం చూపడం సరికాదని.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తప్పకుండా పరేడ్ గ్రౌండ్‌తో కూడిన వేడుకలు నిర్వహించాలని, పరేడ్ ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయించుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టులో సయితం గణతంత్ర వేడుకలు జరుపుతామని న్యాయస్థానం పేర్కొంది.
న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు..
: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్
హైదరాబాద్ ,ప్రజాతంత్ర,జనవారి 25: పరేడ్ తో కూడిన గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాల్సిందేనంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు..అనిహొ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మంగళ వారం విడుదల చేసిన ప్రకటనలో బండి సంజయ్హొ రాజ్యాంగంపై, న్యాయ స్థానాలపై కేసీఆర్ కు గౌరవం ఉంటే హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి.. పరేడ్ గ్రౌండ్ లోనే గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి.. గవర్నర్ వ్యవస్థను గౌరవించాలి. రాజ్యాంగ, ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలి..లేనిపక్షంలో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా రాజ్యాంగ ద్రోహిగా, ప్రజాస్వామ్య ద్రోహిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతారని తెలంగాణ శాఖ పక్షాన హెచ్చరిస్తున్నా..అని పేర్కొన్నారు.