Take a fresh look at your lifestyle.

విలేఖరి….!?

పెన్‌ ‌పవర్‌ ఉన్నోళ్ళు తక్కువ
ఫోజులు కొట్టేటోళ్ళు ఎక్కువ

పోరంబోకోళ్ళంతా దూరుతాండ్లు
మీడియా ముసుగు కప్పుకుంటాండ్లు

విలేఖరి విలువలు పాతరేస్తరు
వార్తను అమ్మకానికి పెడుతరు

ప్రెస్‌ ‌కార్డును అడ్డం పెట్టుకుంటరు
బ్లాక్‌ ‌మెయిల్‌ ‌కు వొడిగడుతరు

ఉన్నరు ఉన్నరు మంచోళ్ళు
మిగతోళ్ళంతా వంచించటోళ్ళు

పాత్రికేయం చులకనయింది!!!!
చూడు ప్రజల్లో పలుచనయింది!!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply