Take a fresh look at your lifestyle.

నూతన సాగు చట్టాలను రద్దు చేయండి

  • లేదంటే ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు ఉధృతం
  • కేంద్రానికి రైతు సంఘం నేత రాకేష్‌ ‌తికాయత్‌ ‌డెడ్‌లైన్‌

నవంబర్‌ 26‌తో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింగు, టిక్రి మరియు ఘాజీపూర్‌లలో కొనసాగుతున్న రైతుల నిరసనలకు ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఆ రోజు వరకు వివాదాస్పద నేతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, లేదంటే ఆ తర్వాత ఢిల్లీ చుట్టూ రైతుల నిరసనలు మరింత  తీవ్రమవుతాయాని కేంద్ర ప్రభుత్వానికి భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌ ‌నేత రాకేష్‌ ‌తికాయత్‌ ‌హెచ్చరించారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మాట్లాడుతూ నవంబర్‌ 26‌కు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింగు, టిక్రి మరియు ఘాజీపూర్‌లలో కొనసాగుతున్న రైతుల నిరసనలకు ఒక సంవత్సరం పూర్తవుతుందని అన్నారు.

రైతుల సమిష్టి సంయుక్త కిసాన్‌ ‌మోర్చా(ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ ‌సరిహద్దులోని ఘాజీపూర్‌లో రైతు సంఘం బికెఎస్‌, ‌దాని మద్దతుదారులు వేస్తున్న శిబిరాలు కూడా ఎస్‌కెఎంలో భాగమే. నవంబర్‌ 27 ‌నుండి రైతులు గ్రామాల నుండి ట్రాక్టర్లలో ఢిల్లీ చుట్టుపక్కల ఉద్యమ ప్రాంతాల వద్ద సరిహద్దుకు చేరుకుంటారని, ఉద్యమ స్థలంలో బలమైన టెంట్లను వేస్తారని బీకేయూ జాతీయ అధికార ప్రతినిది రాకేష్‌ ‌తికాయత్‌ ‌హిందీలో చేసిన ట్వీట్‌ ‌ద్దారా తెలిపారు. రైతుల ఉత్పత్తి వాణిజ్యం, వాణిజ్యం(ప్రమోషన్‌ ‌మరియు సులభతరం) చట్టం, 2020, ధరల హామీ మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020పై రైతుల(సాధికారత మరియు రక్షణ) ఒప్పందంపై డిమాండ్‌తో వందలాది మంది రైతులు నవంబర్‌ 2020 ‌నుండి మూడు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు.

ఎసెన్షియల్‌ ‌కమోడిటీస్‌(‌సవరణ) చట్టం, 2020ని ఉపసంహరించుకోవాలని, పంటలకు కనీస మద్ధతు ధరకు హామీ ఇవ్వడానికి కొత్త చట్టాన్ని రూపొందించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. రైతులతో లాంఛనప్రాయంగా 11 సార్లు చర్చలు జరిపిన కేంద్రం కొత్త చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయని పదేపదే పేర్కొంటుండగా, నూతన సాగు చట్టాల కారణంగా కార్పొరేట్ల దయ కోసం ఎదురుచూడాన్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు పేర్కొన్నారు.

Leave a Reply