Take a fresh look at your lifestyle.

తన భర్తను స్వదేశానికి రప్పించండి అంటు కలెక్టర్‌ను కోరిన ఓ ఇల్లాలు

అనారోగ్యంతో అలుమాటిస్తు బాధపడుతున్న నా భర్త పెద్దుల లస్మయ్య బొల్లారపు ను వెంటనే ఇండియాకు తెప్పించి తన కుటుంబాన్ని ఆదుకోవాలి కోరుతూ కోరుట్ల మండలం ఏకిన్‌ ‌పూర్‌ ‌గ్రామానికి చెందిన పెద్దుల లస్మయ్య భార్య బొల్లారపు లక్ష్మి ప్రవాసి మిత్ర లేబర్‌ ‌యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ ‌కు ఒక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరు నెలల క్రితం విజిట్‌ ‌వీసాతో దుబాయి వెళ్లాడని, మున్నేల్లు ఉపాధి వెతుక్కుని, నాలుగో నెల సత్వా అల్‌ ‌బాడా అనే ఓ క్లినింగ్‌ ‌కంపెనీలో డ్రైవర్‌ ‌గా చేరినట్లు తెలిపారు.

రెసిడెంట్‌ ‌వచ్చిన స్టాంపు, మెడికల్‌ ‌కాలేదని ఇంతలోనే లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా సగం జీతం మాత్రమే అందిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం బాగలేదని అక్కడి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా, 3 వేల ధరమ్స్ అవుతాయని, ఇండియా వెళ్లి చికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే తన భర్త 1400 ధరమ్స్ ‌ఖర్చు చేశారని, కుమార్తె పెళ్లికి, కుటుంబ పోషణకై చేసిన అప్పులు తీర్చేందుకు గల్ఫ్ ‌వెళ్లి అనారోగ్యంతో అక్కడ చిక్కుకుపోయడని లక్ష్మి ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే నా భర్తను ఇండియాకు తెప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!