Take a fresh look at your lifestyle.

మాస్క్ ‌వేసుకోవడం మర్చిపోరాదు

  • భౌతిక దూరం పాటించాల్సిందే
  • వైద్యుల హెచ్చరికలు

శాస్త్రీయ పద్ధతిలో మాస్క్ ‌వేసుకోకుంటే దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని వైద్యులు అంటున్నారు. కరోనా వైరస్‌ను నివారించాలంటే మామూలు మాస్కులు సరిపోతాయని అన్నారు. కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమావళిని పాటిస్తూ, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తమ వరకూ రాదు అని ఎవరూ అనుకోకూడదనుకోవడం వల్లనే ఇవాళ దేశంలో కరోనా విస్తరిస్తోందని అన్నారు. మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వైరస్‌ ‌తీవ్రతకు ప్రజల నిర్‌క్ష్యమే కారణమన్నారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రజలంతా మాస్క్‌లు ధరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాల్సిందేనని
అన్నారు. వైరస్‌ ‌వ్యాపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ‌ధరించి, భౌతికి దూరంతో ముందుకు సాగాలన్నారు.

మాస్క్ ‌లోపలి భాగంలో చేతులతో తాకినా, మాస్క్ ‌వేసుకున్నాం కదా అని చేతులు శుభ్రంగా కడుక్కోకపోయినా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాస్క్ ‌వేసుకున్నాక తరచూ దాన్ని తాకకూడదన్నారు. మాస్క్ ‌వేసుకోవడం వల్ల కొంత అసౌకర్యం ఉంటుంది. దాంతో చాలామంది దాన్ని తరచూ అటు ఇటూ జరుపుతూ ఉంటారు. ఆ సమయంలో మన గోళ్లు నుంచి ఇన్‌ఫెక్షన్‌ ‌ముక్కుల ద్వారా నేరుగా ఊపిరితిత్తులోకి చే రే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే అవసరం ఉన్నా,లేకున్నా మాస్క్ ‌వేసుకోవడం తప్పనిసరి కావాలన్నారు.

Leave a Reply