Take a fresh look at your lifestyle.

మంగళసూత్రం తీసేయడం మానసిక క్రూరత్వం

మద్రాస్‌ ‌హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
మద్రాస్‌,‌జూలై: మంగళసూత్రం ధరించే విషయంపై మద్రాస్‌ ‌హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త బతికుండగా భార్య మంగళ సూత్రాన్ని తీసివేయడం మానసిక క్రూరత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ‘‘ మంగళసూత్రం వైవాహిక జీవితానికి ప్రతీక. భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగించాలి. విడిపోవాలనుకున్న భార్య ముందుగా తాళిని తీసివేయడం అంటే భర్తను మానసిక క్రూరత్వానికి గురిచేసినట్లే అవుతుంది. ‘‘ – మద్రాస్‌ ‌హైకోర్టు ఓ విడాకుల కేసు విచారణలో భాగంగా మద్రాస్‌ ‌హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ‌వీఎం వేలుమణి, జస్టిస్‌ ఎస్‌ ‌సౌంథర్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

తమిళనాడు ఈరోడ్‌కు చెందిన శివకుమార్‌ ‌తనకు విడాకులు ఇవ్వడాన్ని నిరాకరిస్తూ స్థానిక ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని మద్రాస్‌ ‌హైకోర్టులో అప్పీల్‌ ‌చేశారు. ఈ మేరకు 2016 జూన్‌ 15 ‌నాటి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఆయన ఓ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ కేసు విచారణలో భర్త నుంచి విడిపోయే సమయంలో ఆమె తన తాళి గొలుసును తొలగించినట్లు కోర్టు ముందు అంగీకరించింది. దీంతో మన దేశంలో జరిగే వివాహ వేడుకలలో తాళి కట్టడం అనేది ఒక ముఖ్యమైన ఆచారమని కోర్టు పేర్కొంది. ఆయన అప్పీల్‌ను అనుమతించింది. ‘‘ ఆమె తన తాళిని తొలగించినట్లు దాన్ని బ్యాంకు లాకరులో ఉంచినట్లు స్వయంగా అంగీకరించింది.

ఏ హిందూ వివాహిత తన భర్త జీవించి ఉన్న సమయంలో ఏ సమయంలోనైనా తాళిని తీయదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. స్త్రీ మెడలో తాళి అనేది పవిత్రమైన విషయం. ఇది వైవాహిక జీవితం కొనసాగింపును సూచిస్తుంది. అది భర్త మరణించిన తర్వాత మాత్రమే తొలగించాలి. భార్య తాళిని తొలగించడం వల్ల భర్తకు మానసిక క్షోభ కలుగుతుందని హైకోర్టు తెలిపింది.

Leave a Reply