భారతదేశంలో గోర్ బంజారా గిరిజన ఆరాధ్య దైవం ఆల్ ఇండియా బంజారా లంబాడీ శక్తి పీఠ జాతీయ అధ్యక్షుడు బాలబ్రహ్మచారి డాక్టర్ సంత్ తపస్వి రామ్ రావు మహారాజ్ జాతికి చేసిన సేవలు చిరస్మరణీయం… మహారాష్ట్ర, పౌరగాడ్ లో పూతలయాడి పరశురామ్ దంపతులకు (గురు పౌర్ణమి) 1935 జూలై 7న జన్మించాడు. ఆధ్యాత్మిక ఆసక్తితో 12 ఏళ్ళ వయసునుంచీ భోజనం తినడం మానేసి, పాలు పండ్లు మాత్రమే తతీసుకునేవారు. రామ్ రావు మహారాజ్ ఏడవ తరం శ్రీ సేవభయా కుటుంబంలో నివసిస్తూ దేశం నలుమూలల ఉన్న బంజారా జాతి ఐక్యం కోసం బంజారాలను మత్తుపదార్థాల నుంచి విముక్తి చేసేందుకు నిరంతరం తండా తండాకు తిరుగుతూ ఆధ్యాత్మిక బోధనలు చేసేవారు.
జగదాంబ మాత మహిమలను వివరిస్తూ పాదయాత్ర చేస్తూనే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత దేవాలయాలెన్నో నిర్మించారు. రామ్ రావు మహారాజ్ కఠోర దీక్షతో ఎలాంటి ఆరోపణలు లేకుండా బంజారా జాతి కోసం అహర్నిశలు పని చేసారు. చిన్నప్పటినుంచి ఆధ్యాత్మిక ధార్మిక భావాలకి ఆకర్షితులై నేటి వరకు ధర్మ పరిరక్షణ కోసం ఉపవాస దీక్ష సాగిస్తున్నారు. సమాజంలో అందరూ చదువుకుని క్రమశిక్షణతో ఉండాలని, ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో బతికాలని బోధించారు. 86 సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణంలో పీఠాధిపతిగా ధర్మ పరిరక్షణ కోసం ఎనలేని కృషి లేని చేసారు. నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో దేశ వ్యాప్తంగా ఉన్న బంజారాల శ్రేయస్సు కోసం కృషి చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి ఆశీస్సులతో మెలుగుతున్నారు నేటి సమాజంలో. వారి వారసులైన రామ్ రావు మహారాజ్ దేశ వ్యాప్తంగా బంజారా సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
బంజారా ఆరాధ్యదైవం సేవలాల్ మహారాజ్ ఆశయాల సాధనకు మేరమా యాడి భక్తుడు పౌరగాడ్ పీఠాధిపతి, దైవ సమానుడు అఖండ బాలబ్రహ్మచారి శ్రీ శ్రీ తపస్వి సంతు సద్గురు రామ్ రావు మహారాజ్ ఇక లేరన్న వార్త సుమారు 13 కోట్ల బంజారాలకు అశనిపాతం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకింటూ, వారి ఆశీస్సులు ఈ సమాజం పై ఎప్పుడూ ఉండాలని ప్రార్ధిద్దాం. కుందాం…తపస్వి సంత సద్గురు రామ్ రావు మహారాజ్ లేకపోవడం బంజార జాతికి తీరని లోటు.
నరేష్ జాటోత్. ఎం ఏ. బీఈడీ. కాకతీయ విశ్వవిద్యాలయం (8247887267)