Take a fresh look at your lifestyle.

మతమా ..కన్నడ ఆత్మ గౌరవమా ..వోటరు తీర్పు నేడు..!

కర్ణాటక శాసనసభకు మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకోవడానికి •నేడు  పోలింగ్‌ ‌జరగనుంది .కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌ప్రకటించింది మొదలు రాష్ట్రం లోని రెండు ప్రధాన జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతి పక్షం కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచారం హోరాహోరీ గా కొనసాగించాయి. 2018 లో కాంగ్రెస్‌ ‌పార్టీ 80 మంది శాసన సభ్యుల మద్దతుతో 37 సీట్లు గెలిచిన జేడీఎస్‌ ‌ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్‌ ‌నుండి కుమార స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు  చేపట్టాడు. అయితే కొందరు రెబల్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో 2019లో కాంగ్రెస్‌ – ‌జేడీఎస్‌ ‌ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటకలో బీజేపీకి 121 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 70, జేడీఎస్‌ 30 ‌మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2021లో ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను తొలగించిన బీజేపీ అధిష్టానం, బస్వరాజు బొమ్మైను ముఖ్యమంత్రిగా చేసింది.ఈ మొత్తం పదవీ కాలం లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతినిధులు ప్రతి అభివృద్ధి కాంట్రాక్టులలో 40 కమిషన్‌ ‌పొందేవారన్న తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌పార్టీ ఇదే అంశాన్ని తమ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ఉపయోగించింది. గత 4 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధిని, రాబోయేపదవీ కాలంలో చేపట్టబోయే సంక్షేమ , అభివృద్ధి పథకాలను వోటర్లకు వివరించడంలో విఫలమైందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం . పార్టీ రాష్ట్ర శాఖ అభద్రత,నైరాశ్యం కారణంగా భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు,దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మొత్తం ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

150 కోట్ల జనాభా దేశ ప్రధాని గత సంవత్సరం గుజరాత్‌ ‌రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఉచిత సంక్షేమ పథకాల పై వ్యతిరేకత వ్యక్తం చేసి ..కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో లో బీజేపీ రాష్ర శాఖ వివిధ ఉచిత సంక్షేమ పథకాల వాగ్ధానం పై నోరు విప్పక పోవడం రాష్ట్రానికో విధానాన్ని ప్రదర్శించినట్లయింది.ఇటీవల దేశంలో కొన్ని రాష్ట్రాల్లో నిషేధానికి గురయిన వివాదాస్పద ‘కేరళ స్టోరీ’,మత సంస్థ ‘బజరంగ్‌ ‌దళ్‌ ‌ను కాంగ్రెస్‌ ‌పార్టీ తాము అధికారంలోకి రాగానే నిషేధిస్తామని చేసిన ప్రకటన ప్రధాని నరేంద్ర మోదీ కి ప్రచార అస్త్రాలయ్యాయి.దేశాన్ని 5 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక సూపర్‌ ‌పవర్‌గా మార్చడం వంటి వాగ్దానాలతో నవ భారత రూపశిల్పి అని చెప్పుకునే నాయకత్వం అభివృద్ధి ,ప్రజా సంక్షేమం ల ప్రస్తావన లేకుండా కేవలం ఎన్నికల్లో మత పరమయిన ప్రసంగాలు చేసి వోటరును ప్రభావితం చేయడం ఆక్షేపణీయం ..! స్టార్‌ ‌క్యాంపెయినర్‌ ‌స్వయంగా’’జై బజరంగబలి’’అని నినాదం చేయడంతో అది దైవిక మంత్రం కంటే ఎక్కువ ఎన్నికల యుద్ధ భంగిమను వినిపించింది.ప్రచార గడువు ముగియడం తో మంగళవారం వోటరు మహాశయులకు ఆలోచించే సమయం దొరికింది.పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే, ఇద్దరు ప్రధాన రాష్ట్ర నాయకులు సిద్ధరామయ్య మరియు డి.కె.ల ప్రయత్నాలకు తోడుగా గాంధీ కుటుంబం ప్రచారానికి నాయకత్వం వహించింది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని అవినీతి, అసమర్థ ప్రభుత్వంగా చిత్రీకరించడంలో పార్టీ విజయం సాధించింది మరియు వివిధ సర్వేల ప్రకారం, కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారం చేపట్టబోతుందని ప్రకటించాయి.హంగ్‌ ‌కాదని మే 13న స్పష్టమైన తీర్పు వస్తుందని, అలా అయితే రెండు జాతీయ పార్టీల్లో ఏదో ఒకటి సంబరాలు చేసుకుంటే జేడీఎస్‌ ‌ప్రయాణం దాదాపు
ముగిసినట్లేననిప్రజలుకూడాభావిస్తున్నారు.

వోటర్లకుఅన్నిసవాళ్లు,ప్రతిసవాళు,,వాగ్దానాలు,ప్రకటనలు,ప్రమాణాలు,దాడులు,ఎదురుదాడులు,ఆరోపణలు,ప్రకటనలు,సమావేశాలు,ప్రసంగాలు,పాటలు మరియు ఎన్నికల ఇతర విన్యాసాల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గం లో నడిపించే సరయిన అభ్యర్థిని ,అధికారం చేపట్టే పార్టీ ని ఎన్నుకునే ఆలోచన చేయగలుగుతారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిపుష్టంగా ఉండాలని ఆశించే వారు కర్ణాటక వోటరు ప్రతి ఒక్కరు తమ వోటును వినియోగించుకోవాలని ఆశిస్తున్నారు. పార్టీ ఏదయినా..అభ్యర్థి ఎవరయినా…కనీసం ‘నోటా’ కయినా.. ప్రతి వోటరు తమ హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ..!

Leave a Reply