Take a fresh look at your lifestyle.

మానవత్వానికి మతం కాదు అడ్డు.! అందుకు సయ్యద్ ఆదర్శం

మానవత్వానికి మతం కాదు అడ్డు.!.. మత సామరస్యానికి మనసే తొలిపొద్దు.! అని నిరూపించారు యాదాద్రి జిల్లా ఆలేరు మండలం మంధనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సయ్యద్. ఇతను జనగామ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. తన ఇంటిలో ఓ పోర్షన్ నెల్లూరుకు చెందిన బ్రాహ్మణ కుటుంబానికి అద్దెకు ఇచ్చారు. ఆ కుటుంబం లాక్ డౌన్ వలన తమ సొంత ప్రాంతానికి వెళ్ళలేక పోయారు. ఈ మధ్య కాలంలో లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కరోనా భయం వల్ల అద్దెకు ఉన్నవారిని ఇంటి యజమానులు వెళ్ళగొట్టిన సంఘటనలు అనేకం చూశాం. అటువంటిది. తన ఇంట్లో అద్దెకు ఉన్న వారు మరణిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించొచ్చు .అలాంటి పరిస్థితి ఈ ఉపాధ్యాయుడు సయ్యద్ కు ఎదురైంది. తన ఇంట్లో అద్దెకు ఉన్న బ్రాహ్మణ కుటుంబ యజమాని చనిపోవడంతో ముస్లీం అయినా సయ్యద్ మానవత్వాన్ని చాటుకున్నాడు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాడు.

 Religion is not a barrier to humanity.! Syed is the ideal

బంధువులెవరూ లేని బ్రాహ్మణ వృధ్ధుడి అంత్య క్రియలు తనే దగ్గరుండి జనగాం పట్టణ ముస్లీం షబాబ్ కమిటీకి సమాచారం ఇచ్చి కమిటీ యువకుల సహకారంతో బ్రాహ్మణ పరిషత్ సభ్యులకు సమాచారం ఇచ్చి వారి సహకారంతో బ్రాహ్మణ సంప్రదాయంలో అంత్యక్రియల నిర్వహణ చేయించడం , సయ్యద్ మరియూ ముస్లీం యువకులు కూడా పాడె మొయ్యడం మానవత్వానికి ఎల్లలు లేవని మతం అడ్టు కాదని తెలియజేశారు. ఈ సంఘటన మనిషికి మనిషే తోడని మతం అడ్డగోడలు కాదని తెలియజేయడం ముదావహం. ఊ సందర్భంగా ఆలేరు మండలం లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు సయ్యధ్ ను MEO లక్ష్మీ నారాయణ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!