తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి వెబ్సైట్లో వివరాలు చూసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మెమోలు తమ తమ పాఠశాలలో
తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు తెలియజేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.