Take a fresh look at your lifestyle.

వరవరరావు  వెంటనే విడుదల చేయండి

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి  ఉద్దవ్ థాక్రే కు పార్లమెంటు సభ్యుల వినతి

సుప్రసిద్ధ కవి,  ప్రజా సమస్యలపై  గళం విప్పే నాయకుడు    వరవరరావు వయసు  81 సంవత్సరాలు.. ఆయనను    బీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేసి మహారాష్ట్రలోని తలోజా జైలులో    చాలా కాలంగా మగ్గుతున్నారని ..దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. అందునా మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో వరవర రావు ను వెంటనే విడుదల చేయాలని 14 మంది పార్లమెంటు సభ్యులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కు శుక్రవారం లేఖ రాసారు ఆ లేఖ లో వారు ..   “ఆ జైలులో ఉన్న  ఖైదీల్లో చాలా మందికి కరోనా  ఉన్నట్టు వార్తలు రోజూ వస్తున్నాయి.  మహారాష్ట్రలోని జైళ్ళలో ఇంతవరకూ  నలుగురు కరోనా రోగులు మరణించినట్టు వార్తలు వచ్చాయి.  ఈ పరిస్థితుల్లో   వయసు రీత్యా పెద్దవారైన వరవరరావుని ఆ జైలులో ఇప్పటికీ కొనసాగించడం ఎంత మాత్రం సముచితం కాదు. చాలా కాలంగా జైలులో ఉండటం వల్ల వరవరరావు ఆరోగ్యం ఇప్పటికే   క్షీణించింది. శారీరక దుర్బలత్వం,గొంతు పీలగా మారడం, నడవలేని స్థితి వంటి  శారీరక అస్వస్థతలతో ఆయన బాధ పడుతున్నారు.  ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా పరిణమించడంతో   ఆయనను  ముంబాయిలోని జేజే ఆస్పత్రికి  అపస్మారక స్థితిలో  స్ట్రెచర్ మీద తరలించారు. తలోజా  జైలులో ఉండగానే ఆరోగ్యం  క్షీణించింది.  ఆయన హృద్రోగి మాత్రమే కాకుండా  పేగుల్లో అల్సర్ తో బాధపడుతున్నారు.  పూణే జైలుకు తరలించి   అక్కడ కూడా వైద్యులు వైద్యం అందించారు.అయినా ఆయన ఆరోగ్యం మెరుగు పడలేదు.  ప్రస్తుతం జైలులో ఆయనకు అందిస్తున్న చికిత్స     వల్ల ప్రయోజనం ఉండటం లేదు.  ఆయనను ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. ఆయనను  ఇటూఅటూ తరలించే పరిస్థితి కూడా లేదు. కనుక ఆయనను   వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం.   అలాగే, 90  శాతం అంగవైకల్యంతో   జీవనం సాగిస్తున్న ప్రోఫెసర్ సాయిబాబాకు మెరుగైన వైద్య చికిత్స అందించాల్సిందిగా కోరుతున్నామని  కనిమళి  కరుణానిధి ( లోక్ సభ సభ్యురాలు, తూత్తుకుడి, తమిళనాడు),  డిఎంకె,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,   (లోక్ సభ సభ్యుడు, భువనగిరి,  తెలంగాణ), కాంగ్రెస్,డాక్టర్  ప్రోఫెసర్  మనోజ్ ఝా  ( రాజ్యసభ సభ్యుడు,   రాష్ట్రీయ లోక్ దళ్),పిఆర్ నటరాజన్   ( కోయంబత్తూరు ఎంపీ, సిపిఐ),కెకె రాగేష్  ( రాజ్యసభ సభ్యుడు, సిపిఎం),ఎ రేవంత్ రెడ్డి  ( లోక్ సభ సభ్యుడు, మల్కాజ్ గిరి),డా. వికె రవికుమార్   ( విల్లుపురం ఎంపీ, విసికె),ఎం సెల్వరాజ్    ( నాగపట్టణం, లోక్ సభ సభ్యుడు,   సిపిఐ).కె. సుబ్రహ్మణ్యం   ( తిరుప్పూర్  లోక్ సభ సిపిఐ ఎంపీ),డాక్టర్ సుమతి తంగాఛి పాండ్యన్ ( చెన్నై సౌత్  లోక్ సభ సభ్యురాలు, డిఎంకె),తిరుచ్చి శివ  ( రాజ్యసభ సభ్యుడు, డిఎంకె)డాక్టర్ తోల్ తిరుమ వలవాన్  (  చిదంబరం ఎంపీ,    విసికే),ఉత్తమకుమార్ రెడ్డి  ( నల్లగొండ ఎంపీ, తెలంగాణ),ఎస్ వెంకటేశన్ ( లోక్ సభ ఎంపీ,  మదురై,  సిపిఎం) లేఖలో పేర్కొన్నారు.

 

Leave a Reply