విరసం నేత వరవరరావుకి కరోనా టెస్ట్ చేశారని.. రిపోర్ట్ నెగిటివ్ అని వచ్చిందని ఆయన కూతురు పావన విరసం నేత వరవరరావుకి కరోనా టెస్ట్ చేశారని.. రిపోర్ట్ నెగిటివ్ అని వచ్చిందని ఆయన కూతురు పావన తెలిపారు. తెలిపారు. తన తండ్రికి వెంటనే తాత్కాలిక బెయిల్ ఇచ్చి జైల్ నుంచి విడుదల చేయాలని ఆమె కోరారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర •ం శాఖ సహాయ మంత్రి చొరవ తీసుకొని బెయిల్ ఇప్పించాలని పావని కోరారు. హైదరాబాద్ పోలీసులు తమకు పాసులు ఇస్తామంటు న్నారని.. కానీ కోర్టు పర్మిషన్ ఉంటే మాత్రమే తన తండ్రిని కలవగలమన్నారు. కోర్టు పర్మిషన్ కోసం పిటిషన్ వేశామని.. పర్మిషన్ ఇస్తేనే ముంబైకి వెళ్లి కలుస్తామని పావన తెలిపారు.
వరవరరావుతో తమకు వీడియో కాల్ చేయించాలన్నారు. మూడు రోజుల కిందనే వరవరరావు ఆరోగ్యం బాగాలేదని.. తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు చీఫ్ జస్టిస్‌కి లెటర్ రాశామన్నారు. ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తమకు ఆందోళనగా ఉందని పావన తెలిపారు. అక్కడ చికిత్స చేయడం అంత మంచిది కాదన్నారు. వెంటనే తమ తండ్రిని విడుదల చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.