Take a fresh look at your lifestyle.

వరవరరావును విడుదల చేయండి..! ఐజేయూ,టీయూడబ్ల్యుజె విజ్ఞప్తి

దాదాపు ఏడాదిన్నర కాలంగా అండర్ ట్రయిల్ ఖైదీగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ప్రజా కవి, రచయిత వరవరరావును వెంటనే తాత్కాలిక బెయిల్ లేదా పెరోల్ పై విడుదల చేయాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, పీసీఐ మాజీ సభ్యులు కె.అమర్ నాథ్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ లు సంయుక్త ప్రకటనలో కోరారు
“80ఏళ్ల వయస్సున్న వరవరరావును దాదాపు 18 నెలలుగా అండర్ ట్రయల్ పేరుతో జైల్లో బంధించడం అప్రజాస్వామిక చర్యగా భావిస్తున్నాం. కుటుంబ సభ్యులు కూడా ఆయనను కలుసుకోలేని వాతావరణం కల్పించడం, కనీసం ఉత్తర ప్రత్యుత్తరాలకు కూడా అవకాశం కల్పించక పోవడం విచారకరమని వారు పేర్కొన్నారు. క్షీణిస్తున్న వరవరరావు ఆరోగ్యాన్ని జైలు సిబ్బంది పట్టించుకోకపోవడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే “నని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం విచారణలో ఉన్న ఖైదీలకు జీవించే హక్కు ఉన్న విషయాన్ని పాలకులు మరచిపోవడం సహించ రానిదన్నారు. ఆయనను పూణే నుండి ముంబై జైలుకు తరలించడంతో అక్కడ కరోనా పరిస్థితులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయని వారు పేర్కొన్నారు. మరోవైపు 70ఏండ్ల వయస్సున్న వరవరరావు భార్య అనారోగ్యంతో బాధపడు తుందన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, వరవరరావు కూతుళ్ళ విజ్ఞప్తి మేరకు, మానవతా దృక్ఫతంతో ఆయనను తాత్కాలిక బెయిల్ పై లేదా పెరోల్ పై విడుదల చేయాలని శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శేఖర్, విరాహత్, శ్రీకాంత్ లు కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పందించాలని వారు విజ్ఞప్తి చేసారు.

Leave a Reply