Take a fresh look at your lifestyle.

వైఎస్సార్‌ ‌రైతు భరోసా కింద నిధులు విడుదల

  • నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ
  • 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928.88 కోట్లు
  • ఖరీఫ్‌కు ముందు మొదటి విడత కింద రూ.7,500 సాయం

అమరావతి, : రైతన్నకు అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తోన్న ఏపీ ప్రభుత్వం.. ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత రెండేళ్ల మాదిరిగానే మూడో ఏడాది కూడా ’వైఎస్సాఆర్‌ ‌రైతు భరోసా’ తొలి విడత సాయం విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ‌కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కంప్యూటర్‌లో బటన్‌ ‌నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ, రైతులకు మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ’వైఎస్సాఆర్‌ ‌రైతు భరోసా’ కింద మూడో ఏడాది తొలి విడత సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928.88 కోట్ల సాయం అందిస్తున్నామన్నారు.

అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం అందజేస్తున్నామని తెలిపారు. ఖరీఫ్‌కు ముందు మొదటి విడత కింద రూ.7,500 సాయం అందిస్తున్నా మన్నారు. కోవిడ్‌ ‌కష్టకాలంలోనూ రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నామని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌తెలిపారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద సాయం అందజేస్తున్నాం. దేవాదాయ భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఇప్పటివరకు రూ.13,101 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఈ రోజు విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ.1729 కోట్లు జమ చేశాం. 23 నెలల పాలనలో రైతులకు రూ.68 వేల కోట్లు సాయం చేశాం. రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్‌ ‌కోసం రూ.1700 కోట్లు కేటాయించాం. ఈ నెల 25న వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద రూ.2 వేల కోట్లు అందించనున్నాం. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద సుమారు 38 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుందని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌తెలిపారు.

ఒక గొప్ప కార్యక్రమాన్ని దేవుడి దయతో బిడ్డగా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కోవిడ్‌తో కష్టకాలం ఉన్నా, ఆర్థిక వనరులు తగిన స్థాయిలో లేకపోయినా, రైతుల కష్టాలు ప్రభుత్వ కష్టాల కంటే ఎక్కువని, వారికి ఎలాంటి కష్టం కలగకూడదని అడుగులు ముందుకు వేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ వైఎస్సార్‌ ‌రైతు భరోసా కింద 52.38 లక్షల రైతులకు రూ.3,928 కోట్ల పెట్టుబడి సాయం చేస్తున్నా మన్నారు. రైతు భరోసా కింద 52.38 లక్షల రైతులకు మొత్తం రూ.17,029 కోట్లు ఈ 23 నెలల కాలంలో ఇవ్వగలిగాం. వైఎస్సార్‌ ‌సున్నా వడ్డీ పంట రుణాల కింద, గత ప్రభుత్వం వదిలిపెట్టి పోయిన బకాయిలు కూడా కలుపుకుంటే అక్షరాలా 67.50 లక్షల రైతులకు రూ.1,261 కోట్లు ఈ 23 నెలల్లోనే ఇవ్వగలిగాం. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా 15.67 లక్షల రైతులకు ఇప్పటి వరకు రూ.1,968 కోట్లు ఇవ్వగలిగామన్నారు. ’ప్రకృతి వైపరీత్యాల కింద పంట నష్టపోయిన 13.56 లక్షల రైతన్నలకు ఇన్‌పుట్‌ ‌సబ్సిడీ కింద ఈ 23 నెలల్లో అక్షరాలా రూ.1038 కోట్లు ఇవ్వగలిగాం.

ధాన్యం కొనుగోలకు కోసం అక్షరాలా రూ.18,343 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా తెలియజేస్తున్నాను. ఇతర పంటలు కూడా కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా నిలబడేందుకు ఈ 23 నెలల కాలంలో రూ. 4,761 కోట్లు ఖర్చు చేయగలిగామని వివరించారు. ఉచిత వ్యవసాయ విద్యుత్‌ ‌సబ్సిడీ కింద ఈ 23 నెలల కాలంలో అక్షరాలా రూ.17,430 కోట్లు ఖర్చు చేయగలిగామని గర్వంగా చెబుతున్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ’అటవీ హక్కు పత్రాలు’ (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) ‌పొంది సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు, దేవాలయాల భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా వైయస్సార్‌ ‌రైతు భరోసా పథకం వర్తింప చేస్తున్నామని సిఎం వివరించారు. ఖరీఫ్‌ ‌సాగు ఇప్పుడు మొదలవుతోంది. పెట్టుబడి కోసం ఏ రైతు ఇబ్బంది పడకూడదని ఇవాళ మొదటి విడత పెట్టుబడి సాయం చేస్తున్నామన్నారు. అదేవిధంగా వైయస్సార్‌ ఉచిత పంటల బీమా కింద ఈనెల 25న దాదాపు 38 లక్షల రైతులకు దాదాపు రూ.2 వేలకోట్లు అందించబోతున్నామని చిరునవ్వుతో చెబుతున్నానని చెప్పుకొచ్చారు.

Leave a Reply